విజయ్‌ను.. విమర్శించను! ఖుష్బూ.. తమ్ముడు అని పిలుస్తుంది
ABN, Publish Date - Apr 02 , 2026 | 09:47 AM
తన ఎన్నికల ప్రచారంలో టీవీకే పార్టీని గానీ, ఆ పార్టీ అధినేత విజయ్‌ను గానీ విమర్శించనని సినీ దర్శకుడు సుందర్.సి (Sundar C) ప్రకటించారు.
తన ఎన్నికల ప్రచారంలో టీవీకే పార్టీని గానీ, ఆ పార్టీ అధినేత విజయ్‌ను గానీ విమర్శించనని సినీ దర్శకుడు సుందర్.సి (Sundar C) ప్రకటించారు. అన్నాడీఎంకే కూటమిలోని పుదియ నీతి కట్చి పార్టీ తరఫున (Puthiya Needhi Katchi (PNK)) మదురై సెంట్రల్ నియోజకవర్గంలో సుందర్ పోటీచేయనున్న విషయం తెలిసిందే. అందుకోసం ఆయన బుధవారం మదురై వెళ్లారు.
ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విజయ్ (Vijay) తనతో ఎంతో మర్యాదగా నడుచుకుంటారని, తాను అలాగే ఉంటానన్నారు. తన భార్య ఖుష్బూ (Khushboo) కూడా విజయ్‌ని తమ్ముడు అని పిలుస్తుందన్నారు. ఈ కారణంగా విజయ్, ఆ పార్టీ అభ్యర్థిపై విమర్శలు చేయనని తెలిపారు.
ఈ ఎన్నికల్లో రెండాకులు, ఉదయించే సూర్యుడు మధ్య పోటీ నెలకొని ఉంటుందన్నారు. తన తరపున ఖుష్బూ కూడా ప్రచారంలో పాల్గొంటుందన్నారు. మదురై సెంట్రల్ నియోజకవర్గ (Madurai Central Assembly constituency) ప్రజలు తనను గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు.