సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ స్వేచ్ఛా జీవితం ఇష్టం

ABN, Publish Date - Nov 23 , 2026 | 10:01 AM

పెళ్లి, వ్యక్తిగత జీవితం విషయంలో తన ఆలోచనలు ఎలా ఉంటాయో నటి నిత్యామేనన్ స్పష్టం చేశారు.

Nithya Menen

వ్యక్తిగత జీవితంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతానని ప్రముఖ నటి నిత్యా మేనన్ (Nithya Menen) అన్నారు. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తి జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. 'నేను ఎల్లవేళలా ఒంటరిగా ప్రయాణం చేసేందుకు ఇష్ట పడతాను.

నేను వివాహ బంధానికి వ్యతిరేకం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. నాకు కూడా వివాహం చేసుకోవాలని ఉంది. కానీ, నాకు సరైన వ్యక్తి తారస పడాలి. అదేసమయంలో పెళ్ళి చేసుకోవాలని ఆరాటపడటం లేదు. నిజాయితీతో కూడిన బంధాన్ని కోరుకుంటున్నాను. ఆ బందం అలాంటిది కాకపోతే నేను పెళ్ళికి దూరంగా ఉంటాను.

ఒక వ్యక్తి జీవితంలో పవిత్రంగా ఉండాలి. అహంకారంతో నడుచుకుంటే అలాంటి బంధం సరైనది కాదు. నా జీవితంలో నా ఎంపికలు భిన్నంగా ఉంటాయి. పెద్దలు కుదర్చిన వివాహాల్లో చాలా జంటలు ఎంతో సంతోషంగా, అన్యోన్యంగా ఉంటున్నారు.

మరికొందరు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని సమయాల్లో మనమే ఎంపిక చేసుకున్న వ్యక్తికి విడాకులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో ఏది తప్పు, ఏది కరెక్ట్ అనేది మనం చెప్పలేం' అని వేదాంత ధోరణిలో నిత్యామేనన్ పేర్కొన్నారు.

Updated Date - Nov 23 , 2026 | 10:04 AM