సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rishab Shetty: 'టాక్సిక్‌'లో.. కథ, కేరక్టర్లూ లేవు

ABN, Publish Date - Aug 31 , 2026 | 05:56 AM

యశ్ నటించిన ‘టాక్సిక్‌’ సాహసోపేతమైన ప్రయోగమని కొనియాడారు ప్రముఖ నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి.

Rishab Shetty

యశ్ (Yash) నటించిన ‘టాక్సిక్‌’ (Toxic) సాహసోపేతమైన ప్రయోగమని కొనియాడారు ప్రముఖ నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి (Rishab Shetty). ‘టాక్సిక్‌’ సినిమా గురించి ఆయన సోషల్‌ మీడియాలో ప్రస్తావించారు. ‘నటీనటులు ఎవరైనా తాము నటించే పాత్రలకు మనస్ఫూర్తిగా న్యాయం చేస్తారు.

‘టాక్సిక్‌’లో ఓ శక్తిమంతమైన వ్యక్తి ఎదుర్కొనే సవాళ్లను అద్భుతంగా చూపించారు. అన్నీ చిత్రాల్లోలాగా ఇందులో కథ, కేరక్టర్లూ కొనసాగకపోవచ్చు. అంతమాత్రాన వాటిని మలిచిన విధానం తప్పనికాదు. ఆలోచనను కథగా మలిచి, తెరమీద ప్రదర్శించిన తీరు ప్రశంసనీయం. యశ్‌ నటనని ప్రతి సన్నివేశంలోనూ ఆస్వాదించాను. పాత్రలో ఆయన ఒదిగిన తీరు మెప్పించింది.

అపరాధభావం ఒక వ్యక్తి జీవితంలో ఎలా టాక్సిక్‌గా మారుతుందో ప్రేక్షకులకు అనుభవంలోకి వచ్చేలా చెప్పడం మామూలు విషయం కాదు. యశ్‌ డేరింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌కి నా పూర్తి మద్దతిస్తున్నాను. కన్నడ సినిమాను గ్లోబల్‌ స్టేజ్‌కి తీసుకెళ్లడానికి ఆయన చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాం’ అని పోస్టు చేశారు.

Updated Date - Aug 31 , 2026 | 06:03 AM