సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Karunas: ఇపుడు నాకు.. పెద్దగా మార్కెట్ లేదు! కానీ నాతో.. సినిమాకు రూ.7 కోట్లు ఖర్చు చేశారు

ABN, Publish Date - Sep 09 , 2026 | 09:02 AM

దేశంలో ఇప్పటిరకు ఏ దర్శకుడు లేవ 'నెత్తని ప్రశ్న ఎన్నవిలై చిత్రంలో దర్శకుడు సజీవ్ లేవనెత్తారని ప్రముఖ నటుడు కరుణాస్ అన్నారు.

Karunas

దేశంలో ఇప్పటిరకు ఏ దర్శకుడు లేవ 'నెత్తని ప్రశ్న ఎన్నవిలై (Enna Vilai) చిత్రంలో దర్శకుడు సజీవ్ లేవనెత్తారని ప్రముఖ నటుడు కరుణాస్ (Karunas) అన్నారు. ఆయన. హీరోగా నటించిన చిత్రం ఎన్నవిలై (Enna Vilai). నిమిషా సజయన్ (Nimisha Sajayan) ఓ ప్రధాన పాత్ర పోషించారు. కళామయ సినీవర్ పతాకంపె జితేష్ విశ్వంభరన్, అనుగోపాల్ వేణుగోపాలన్ నిర్మించారు. జాతీయ అవార్డు గ్రహీత సజీవ్ పళూర్ (Sajeev Pazhoor) కథ సమకూర్చి దర్శకత్వం వహించారు. ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో ఆడియో, ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో దర్శకుడు సజీవ్ మాట్లాడుతూ, 'గతంలో అనేక లఘు చిత్రాలు తీశాను దర్శకు డిగా తమిళంలో తొలి చిత్రం ఇదే. అందుకే 'ఎన్న విలై' పేరుతో ఒక ప్రశ్న లేవనెత్తాను. సినిమాను ఆదరించాలని కోరారు. నటుడు కరుణాస్ మాట్లాడుతూ, 'చిత్రపరిశ్రమలోకి వచ్చి పాతికేళ్ళు పూర్తి కానున్నాయి. ఈ శుభతరుణంలో తొలిసారి నేను హీరోగా నటించిన చిత్రం విడుదలకావడం ఆనందంగా ఉంది.

నాకు మలయాళ చిత్రాలు చూడటం చాలా ఇష్టం అందుకే మలయాళ రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కనీసం ఒక చిత్రంలోనైనా పనిచేయాలని కోరుకున్నారు. అది ఇపుడు నెరవేరింది. ఇది సామాన్యుడి చిత్రం. అందుకే సాధారణ నటీనటుల‌నే దర్శకుడు ఎంచుకున్నారు.

ఇపుడు నాకు పెద్దగా మార్కెట్ లేదు. కానీ రూ.7 కోట్లు ఖర్చు చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. దానికి కారణం కథపై దర్శక నిర్మాతలకు ఉన్న నమ్మకం. భారతీయ చిత్రసీమలో ఇంతకు ముందు ఎవరూ లేవనెత్తని ఒక ప్రశ్నను దర్శ కుడు సజీవ్ ఈ చిత్రం ద్వారా సంధించారు. ఈ చిత్రంతో నిమిషా సజయన్ న్యాయవాది పాత్రను పోషించారు. ఈ సినిమాతో పాటు నా పాత్ర ప్రతి ఒక్కరికీ బాగా నచ్చుతుందన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 09:02 AM