Vijay Sethupathi: రొటీన్.. విలన్ పాత్రలు చేయను
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:21 PM
తనకు రొటీన్ విలన్ పాత్రల్లో నటించడం ఇష్టం లేదని ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) స్పష్టం చేశారు.
తనకు రొటీన్ విలన్ పాత్రల్లో నటించడం ఇష్టం లేదని ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) స్పష్టం చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న 'జైలర్-2' మూవీలో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ, 'సూపర్ స్టార్ చిత్రంలో విలన్ పాత్రలో నటించాలన్నది నా కోరిక.
ఇప్పుడు 'జైలర్-2'లో ఓ చిన్న పాత్ర పోషించాను దానికి కారణం రజనీకాంత్ అంటే అమితమైన ఇష్టం, ప్రేమ, అభిమానం, ఆయనతో కలిసి ఉంటే అనేక విషయాలను నేర్చుకోవచ్చు. కేవలం ఉత్తేజపరిచే కథల్లో మాత్రమే విలన్ పాత్రలు, అతిథి పాత్రల్లో నటించాలని వుంది.
ప్రతినాయకుడిగా నటించేందుకు అనేక కథలను విన్నాను.. చాలా మంది దర్శకులు హీరోను హైలైట్ చేసే కథా పాత్రలే చెప్పారు. అలాంటి పాత్రల్లో నటించాలని అనుకోవడం లేదు' అని వెల్లడించారు. ఇదిలాఉంటే.. విజయ్ సేతుపతి జన్మదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న 'స్లమ్ డాగ్ మూవీ ఫస్ట్ లుక్ శుక్రవారం విడుదల చేశారు.