సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Deekshith Shetty: కన్నడ ఇండస్ట్రీని మర్చిపోయావా? ర‌ష్మికపై ఫైర్!

ABN, Publish Date - Oct 27 , 2026 | 09:47 AM

ఇతర భాషల్లో ఎదిగినా కన్నడ ఇండస్ట్రీని, తన మూలాలను మర్చిపోవద్దంటూ ర‌ష్మికపై ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

vijay deverakonda, rashmika

ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ (vijay deverakonda), ర‌ష్మిక (rashmika mandanna) జంట‌గా న‌టించిన ర‌ణ‌బాలి (Ranabaali) చిత్రం థియేట‌ర్ల వ‌ద్ద విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. విడుద‌లైన అన్ని ప్రాంతాల‌లో (ఓవ‌ర్సీస్‌ మిన‌హా) బ్రేక్ ఈవ‌న్ సాధించి లాభ‌ల బాట‌లోకి వ‌చ్చిన‌ట్లు ఇటీవ‌ల మేక‌ర్స్ సైతం ప్ర‌క‌టించారు. అయితే.. వారు ఈ స‌క్సెస్‌ను ఈ కొత్త జంట‌ ఎంజాయ్ చేసే స‌మ‌యంలో తాజాగా జ‌రిగిన ప‌లు ఘ‌ట‌న‌లు ఇటు సామాజిక మాధ్య‌మాల‌ను అటు వారిరువురికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో వారే స్వ‌యంగా రంగంలోకి దిగాల్సిన ప‌రిస్థితి అత్య‌వ‌స‌ర‌మైంది. అస‌లు విష‌యానికి వ‌స్తే..

విజయ్ దేవరకొండతో వివాహ బంధంపై సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలను రష్మిక ఖండించారు. తమ వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. జరిగింది ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా అరకొర సమాచారంతో నిర్ణయానికి రావొద్దని హితవు పలికారు. ఈ మేరకు ఇన్ స్ట్రాగ్రామ్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇటీవలే ప్రసారమైన బాలీవుడ్ రియాలిటీ షో 'కాఫీ విత్ కరణ్' లో విజయ్, రష్మిక పాల్గొన్నారు. అందులో విజయ్ మాట్లాడుతూ 'రష్మిక పెళ్లి చేసుకోమని నన్ను 100 సార్లు అడిగింది' అని చెప్పారు.

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఈ విషయం పైనే రష్మిక తాజాగా స్పందించారు. 'మేము ఇచ్చిన ఇంటర్వ్యూకు వస్తున్న స్పందన చూస్తుంటే, మేం ఏం చెప్పామో అర్థం చేసుకోవడం కంటే, ఎవరినో ఒకరిని తప్పుబట్టడం పైనే ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నట్లు అనిపించింది. నేను పెళ్లి ప్రపోజల్ తెచ్చినప్పుడు విజయ్ సమయం తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి, జీవితంలోని ఒడుదుడుకులను కలసి ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామో లేదో తెలుసుకోవడానికి తగినంత సమయం తీసుకోవడం కూడా ముఖ్యమే. తన జీవితంలో ఏం కావాలో విజయ్‌కు బాగా తెలుసు. ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఎవరైనా సరే ఆలోచిస్తారు.

పెళ్లి అనేది ఒక గొప్ప ప్రతిపాదన. అందుకే మేము మా ఇద్దరినీ ఎంచుకున్నాం. అవును.. విజయ్ అంటే నాకు పిచ్చి ప్రేమ. అందులో తప్పేముంది? ఇదేమీ చెడ్డ విషయం కాదు కదా? కష్టాల్లో నా పక్కన ఎవరూ లేకున్నా, విజయ్ అండగా నిలబడ్డాడు. నా జీవితానికి సంబంధించిన విషయాల్లో వాస్తవాల కంటే నిరాధారమైన వాటినే ఎక్కువగా నమ్ముతున్నారు. ఇలాంటి వాటిని కొందరు ఇష్టపడం భయంగా అనిపిస్తోంది. నేను బాధలో ఉన్నప్పుడు, నాకు భద్రత, ఓదార్పు, మద్దతు అవసరమైనప్పుడు మీరెవరూ నా పక్కన లేరు. ఉండరు.. కానీ విజయ్ ఉంటాడు. ప్రస్తుతం జీవితంలో ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నాను. నా కుటుంబం గురించి పూర్తిగా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం ఫెమినిజం ముసుగులో జరుగుతున్న వేధింపు మాత్రమే' అని పేర్కొన్నారు.

ఇదే విషయంపై విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. తాము సంతోషంగా ఉన్నామని, రష్మికతో జీవితం పంచుకోవడం ఆశీర్వాదమన్నారు. 'ఒకవేళ నేను, ఆమె ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా ఉన్నామనిపిస్తే అలాగే కానివ్వండి. ప్రేమను ఓ వేడుకగా జరుపుకొనేవారు. సాధారణ జీవితాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉండేవారికి నా హృద యపూర్వక కృతజ్ఞతలు' అని పోస్ట్ చేశారు.

సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు

విజయ్ దేవరకొండ, రష్మి కపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై విరోష్ టీమ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. 'కాఫీ విత్ కరణ్' షోలో మాట్లాడిన విషయాలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో ఆసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

ఈ క్ర‌మంలోనే ఇదిలాఉండ‌గానే ఓ క‌ర్ణాట‌క నెటిజన్ ర‌ష్మిక మంద‌న్న‌పై ఫైర్ అయ్యాడు. ఈ మేర‌కు ఓ సుదీర్ఘ పోస్టు పెట్టి విమ‌ర్శ‌లు చేశాడు. క‌న్న‌డ‌లో కెరీర్ స్టార్ట్ చేసి తెలుగుతో గుర్తింపు తెచ్చుకుని పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన వారు తన మూలాలను మాత్రం మర్చిపోకూడదంటూ వ్రాసుకొచ్చాడు. ‘కిరిక్ పార్టీ’ సినిమాతో కన్నడ ప్రేక్షకులకు దగ్గరైన ఆమెకు ఆ తర్వాత మంచి గుర్తింపు వచ్చిందని నెటిజన్ గుర్తు చేశారు. కన్నడిగులు ఆమెను ఆదరించారని, ఆమె ఎదుగుదలను చూసి సంతోషించారని పేర్కొన్నారు. ఇతర భాషల్లో సినిమాలు చేయడం, ఎక్కడైనా స్థిరపడటం, నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఆమె వ్యక్తిగత విషయాలని అన్నారు. అయితే, తనకు తొలి అవకాశం ఇచ్చిన కన్నడ ఇండస్ట్రీని మాత్రం మర్చిపోవద్దని సూచించారు.

అయితే గ‌డిచిన ద‌శాబ్ద కాలంగా అమె కన్నడ సినిమాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే సమయంలో హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని మాత్ర‌మే ప్రస్తావించారని, కన్నడ ఇండస్ట్రీని పక్కన పెట్టినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఇతర విషయాలపై విమర్శలు వచ్చినప్పుడు మాత్రమే తన మూలాలను గుర్తుచేసుకోవడం బావ్యం కాద‌ని అన్నారు. ఆమె ఎక్కడైనా సినిమాలు చేయ‌వ‌చ్చు, నచ్చిన జీవితం గడపవచ్చు కానీ, కూర్గ్‌కు చెందిన కన్నడిగురాలిగా తన మూలాలను గుర్తుంచుకోవాలని సూచించారు. కన్నడ భాషను, అక్కడి సినీ పరిశ్రమను ఆదరించిన ప్రేక్షకులను గౌరవించాలని అన్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన కన్నడ ఇండస్ట్రీతోనూ అనుబంధాన్ని కొనసాగించాలని అభిప్రాయపడ్డారు.

అయితే.. ఇంత‌లా వ్యాఖ్య‌లు చేసిన వ్య‌క్తి పేరు దీక్షిత్ షెట్టి (Deekshith Shetty) కాగా ఓ ప్ర‌ముఖ క‌న్న‌డ సినిమా న‌టుడి పేరు కూడా అదే అవ‌డంతో అంతా ఆ న‌టుడే ఈ పోస్టు చేశాడ‌ని భావిస్తున్నారు. దాంతో ఆ పోస్టు క్ష‌ణాల్లోనే సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతుంది. పైగా స‌ద‌రు హీరో రీసెంట్‌గా వ‌చ్చిన గ‌ర్ల్‌ఫ్రెండ్ సినిమాలో ర‌ష్మిక‌కు జంట‌గా న‌టించ‌డంతో ఈ వార్త‌కు మ‌రింత ప్రాధాన్య‌త చేకూరింది.

Updated Date - Oct 27 , 2026 | 11:02 AM