షాకింగ్.. హన్సిక కృష్ణ బోల్డ్ వీడియో లీక్
ABN, Publish Date - May 09 , 2026 | 03:10 PM
ప్రస్తుతం సోషల్ మీడియాలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో, అంతే వేగంగా దుర్వినియోగం కూడా పెరుగుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో, అంతే వేగంగా దుర్వినియోగం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ వచ్చాకా దానిని మంచి కోసం ఉపయోగించేవారు కొందరు అయితే.. చెడు కోసం ఉపయోగించేవారు మరికొందరు. సెలబ్రిటీల ఫోటోలను తీసుకొని డీప్ ఫేక్ వీడియోలను పోస్ట్ చేయడం కొంతమందికి ఫ్యాషన్ గా మారింది. ఇలాంటి ఘటనలు ఇటీవల సెలబ్రిటీలను మాత్రమే కాకుండా సాధారణ ప్రజలను కూడా ప్రభావితం చేస్తున్నాయి.
తాజాగా మలయాళ నటుడు కృష్ణ కుమార్ కుమార్తె హన్సిక కృష్ణ బోల్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ కుమార్ కూతురు హన్సిక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది. 20 ఏళ్ళ వయస్సులోనే స్టార్ గా నిలిచింది. ఈ మధ్యనే హన్సికకు సంబంధించిన ఒక వీడియో లీక్ అయ్యింది. అందులో ఆమె అందాలను ఆరబోస్తూ.. కుర్రాళ్ళను రెచ్చగొట్టేవిధంగా సైగలు చేస్తూ కనిపించింది. సడెన్ గా ఈ వీడియో చూసి నెటిజన్స్ మండిపడుతున్నారు. ఒక నటుడి కుమార్తె ఇలా చేయడమేంటి అంటూ ఫైర్ అవుతున్నారు.
తాజాగా ఈ వీడియోపై హన్సిక స్పందించింది. అందులో ఉన్నది తాను కాదని తెలిపింది. అది డీప్ ఫేక్ వీడియో అని, తన ముఖాన్ని మార్చి ఎవరో కావాలనే తనను ఇబ్బందిపెడుతున్నారని చెప్పింది. ఇలాంటి అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని, ఇలా చేసినవారిపై లీగల్ గా చర్యలు తీసుకుంటానని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.