సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Haiku: నెట్ ఫ్లిక్స్ ను మెప్పించింది.. కాలేజీ రోజులకు తీసుకెళ్తుంది..

ABN, Publish Date - Oct 18 , 2026 | 01:29 PM

‘హైకూ’ ట్రైలర్ ఆహ్లాదకరంగా ఉందని, ఇది కాలేజ్ రోజులను గుర్తు చేసే సిన్సియర్ లవ్ స్టోరీ అని కోన వెంకట్ ప్రశంసించారు.

‘హైకూ’ ట్రైలర్ ఆహ్లాదకరంగా ఉందని, ఇది కాలేజ్ రోజులను గుర్తు చేసే సిన్సియర్ లవ్ స్టోరీ అని కోన వెంకట్ ప్రశంసించారు. ఈ కథ నెట్‌ఫ్లిక్స్‌ను సైతం మెప్పించిందని, ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే అంశాలు సినిమాలో ఉన్నాయని అన్నారు ముఖ్యంగా శ్రీదేవి కోసం ఈ సినిమాను ప్రత్యేకంగా చూడాలని ఆయన పేర్కొన్నారు.  ఏగ‌న్‌, శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో హీరోయిన్లుగా విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై రూపొందుతోన్న‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 23న మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోన వెంక‌ట్  మాట్లాడుతూ "ముందే ఓటీటీకి అమ్మేసి అప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం నిజంగా గ్రేట్. నెట్ ఫ్లిక్స్ వారికీ స్టోరీ చెప్పి ఈ హైకూ తీశారంటే వాళ్ళని ఈ స్క్రిప్ట్ ఎంత మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కథ కచ్చితంగా అందరినీ ఎగ్జైట్ చేస్తుంది" అన్నారు.

హీరో ఏగన్ మాట్లాడుతూ ‘‘నేను ఇండస్ట్రీకి కొత్త. హైకూ సినిమా నాకు బాగా దగ్గరైంది. కష్టపడి సినిమా చేశాము. ఈ సినిమాపై నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ సిద్దు కుమార్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు' అన్నారు.  


హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ
‘‘ఈ సినిమా నా హార్ట్ కి చాలా బాగా కనెక్ట్ అయింది. కథ వినగానే బాగా నచ్చి వెంటనే ఓకే చేశా. లవ్ లో ఉన్నా, రిలేషన్ షిప్ లో ఉన్నా, మ్యారీడ్ కపుల్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. లవ్ లో  ఉన్న కాంప్లికేషన్స్ మొత్తం ఈ సినిమాలో చూస్తారు. నన్ను చాలా కూల్ గా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. తమిళంలో ఇది నా ఫస్ట్ డెబ్యూ" అన్నారు.

Updated Date - Oct 18 , 2026 | 01:29 PM