సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Immortal: ‘ఇమ్మోర్టల్‌’.. మరణం లేని మనిషి కథ

ABN, Publish Date - Sep 15 , 2026 | 08:25 AM

మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న జీవీ ప్రకాశ్‌.. హీరోగానూ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇమ్మోర్టల్‌’ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న జీవీ ప్రకాశ్‌.. హీరోగానూ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇమ్మోర్టల్‌’ (Immortal). ‘నాకు మరణం లేదు’ అనేది ఉపశీర్షిక. మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 19న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో జీవీ ప్రకాశ్‌ మ్యాగీ అనే పాత్రలో కనిపించగా.. కయాదు లోహర్‌ సింధు పాత్రలో నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీతో పాటు కథలోని భావోద్వేగాలను కూడా ట్రైలర్‌లో చూపించారు. ప్రేమ, భావోద్వేగాలు, మరణం చుట్టూ సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ‘నాకు మరణం లేదు’ అనే ఉపశీర్షిక సినిమాకు మరింత ఆసక్తి  కలిగిస్తోంది. అసలు కథలో ‘ఇమ్మోర్టల్‌’ అనే అంశం ఎలా ముడిపడి ఉంది? మ్యాగీ జీవితంలో చోటుచేసుకునే పరిణామాలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

Sydney Sweeney: నగ్నంగా స్పోర్ట్స్ యాడ్.. సిగ్గులేదా.. ఆడవారి పరువు తీసావ్

Amitabh Bachchan: జయా బచ్చన్‌కు అసలు టైమ్ చెప్పని అమితాబ్‌.. బిగ్‌బీ ఫన్నీ ట్రిక్‌ ఇదే!

మంగళ గౌరి.. డ్రాగన్ పాప లేడీ ఓరియెంటెడ్ సినిమా మొదలెట్టేసింది

Updated Date - Sep 15 , 2026 | 08:42 AM