Easwari Rao: రజనీతో నటించడం ప్రత్యేకం
ABN, Publish Date - Jun 27 , 2026 | 09:48 AM
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి వెండితెరను షేర్ చేసుకోవడం అనేది ప్రత్యేక అనుభూతి అని సీనియర్ నటి ఈశ్వరీ రావు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో (Rajanikanth) కలిసి వెండితెరను షేర్ చేసుకోవడం అనేది ప్రత్యేక అనుభూతి అని, ఆ అవకాశం తనకు 28 యేళ్ళ తర్వాత దక్కిందని ప్రముఖ సీనియర్ నటి ఈశ్వరీ రావు (Easwari Rao) తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 1990లో వచ్చిన ‘కవిదై పాడుమ్ అలైగల్’ అనే చిత్రంతో వెండి తెరకు పరిచయమైన ఈశ్వరి రావు వైజయంతి. మాతృభాష తెలుగులో బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన ‘రామన్ అబ్దుల్లా’ అనే చిత్రం ద్వారా క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ‘గురు పార్వై’, ‘సింహరాశి’, ‘సుందరి నీయుం సుందరన్ నానుం’ ‘అప్పు’ ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’ వంటి చిత్రాల్లో నటించారు.
దక్షిణాది పరిశ్రమలో 60కి పైగా చిత్రాల్లో నటించిన ఈశ్వరి రావు 28 సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘రజనీకాంత్ ‘కాలా’ చిత్రంలో ఆయన భార్యగా నటించాను. వాస్తవానికి బాలుమహేంద్ర దర్శకత్వం వహించిన ‘నీంగల్ కేట్టవై’ సినిమాలో నేను నటించాల్సింది. కానీ, కొన్ని కారణాలతో ఆ అవకాశం చేజారిపోయింది. ఆ తర్వాత ఎలాగైనా రజనీ సరసన నటించాలని గట్టిగా అనుకున్నాను. ఆ అవకాశం ‘కాలా’ చిత్రంలో వరించింది. ఆయన సరసన నటించడం ఎంతో ప్రత్యేకం’ అని పేర్కొన్నారు.