సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దుల్కర్ సినిమాకు షాక్.. విడుదల రోజే షోలు రద్దు

ABN, Publish Date - Sep 03 , 2026 | 10:24 AM

దుల్కర్ సల్మాన్‌ నటించిన ‘ఐయామ్ గేమ్’ సినిమాకు విడుదల రోజే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salmaan) నటించిన ‘ఐయామ్ గేమ్’ (I Am Game) సినిమాకు విడుదల రోజే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గురువారం . గురువారం విడుదల కావాల్సిన ఈ సినిమా మార్నింగ్ షోలు పలు ప్రాంతాల్లో రద్దయ్యాయి. సినిమాకు సంబంధించిన కంటెంట్‌ సకాలంలో థియేటర్లకు చేరకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగులోనూ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు దుల్కర్ సల్మాన్‌ ప్రమోషన్స్‌ చేశారు. దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి ప్రత్యేక ప్రమోషనల్ ఈవెంట్‌లోనూ పాల్గొన్నారు. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు గురువారం థియేటర్లలో విడుదలైంది.అయితే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. పలు సెంటర్లలో తెలుగు షోలు ప్రారంభం కాకపోగా, కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం షోలు కూడా రద్దైనట్లు సమాచారం.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మలయాళ వెర్షన్‌ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ‘ఐయామ్ గేమ్’పై మొదటి నుంచీ అంచనాలు లేవు. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ   జోష్ కనిపించలేదు. ఇలాంటి సమయంలో విడుదల రోజే షోలు రద్దు కావడం సినిమాకు మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇది ఓపెనింగ్స్‌తో పాటు సినిమా ఫలితంపైనా ప్రభావం చూపుతుందా అనేది చూడాలి.వేఫేరర్ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై జామ్ వర్గీస్‌తో కలిసి దుల్కర్ సల్మాన్‌ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం.. ఆయన బ్యానర్‌లో రూపొందిన అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలిచింది. కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించగా, తెలుగులో ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌ విడుదల చేస్తోంది.

Updated Date - Sep 03 , 2026 | 10:26 AM