మమ్ముట్టి-దుల్కర్ కాంబోలో ‘మేళా’.. ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్
ABN, Publish Date - Sep 07 , 2026 | 09:34 AM
మలయాళ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన మమ్ముట్టి కంపెనీ నిర్మిస్తున్న తొమ్మిదో చిత్రానికి ‘మేళా’ అనే ఆకట్టుకునే టైటిల్‌ను ఖరారు చేశారు.
మలయాళ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన మమ్ముట్టి (Mammootty) కంపెనీ నిర్మిస్తున్న తొమ్మిదో చిత్రానికి ‘మేళా’ (MELA) అనే ఆకట్టుకునే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేయగా, సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
‘ఫాలిమి’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు నితీష్ సహదేవ్ (Nithish Sahadev) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మమ్ముట్టి కంపెనీతో పాటు దుల్కర్ సల్మాన్‌కు చెందిన వేఫారర్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టైటిల్ పోస్టర్‌లో కనిపించిన విజువల్స్, డిజైన్ చిత్రంపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. త్వరలోనే నటీనటులు, కథాంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ వెల్లడించే అవకాశం ఉంది.