యశ్ 'టాక్సిక్'.. వాయిదా! ఎందుకంటే
ABN, Publish Date - Mar 04 , 2026 | 11:21 AM
కన్నడ స్టార్ యశ్, హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నడ, ఇంగ్లీష్ భాషలలో తెరకెక్కిన చిత్రం టాక్సిక్ విడుదల వాయిదా పడింది.
కన్నడ స్టార్ యశ్, హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నడ, ఇంగ్లీష్ భాషలలో తెరకెక్కిన చిత్రం టాక్సిక్ (Toxic A Fairy Tale for Grown-Ups). కియారా అద్వానీ (Kiara Advani), నయనతార (Nayanthara), రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth), హుమా ఖురేషి (Huma Qureshi,) వంటి తారలు కీలక పాత్రల్లో నటించారు. సీనియర్ నటి గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.
అయితే ఈ సినిమా ఇప్పటికే మార్చి 19న విడుదలకు రెడీ అవగా సినిమా నుంచి ఆప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల పాట విడుదల చేయగా మార్చి 8న ట్రైలర్ విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సడన్‌గా మేకర్స్ అటు కన్నడ ప్రజలకు, అభిమానులకు షాకిచ్చారు.
ప్రస్తుతం ఆసియా దేశాలైన ఇరాన్, సౌదీ, దుబాయ్, వంటి దేశాల్లో యుద్దం తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో భాగస్వాములు, ప్రేక్షకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
తిరిగి జూన్ 4న ఈ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, భారతీయ భాషల్లో థియేటర్లలో విడుదల చేస్తామని ప్రటిస్తూ సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేశారు. సినిమా వాయిదా వేస్తున్నందుకు ఫ్యాన్స్‌ను క్షమాపణలు కోరారు. కానుంది.