Drishyam 3: జార్జ్ కుట్టి.. ప్రతి కదలిక అలరిస్తుంది
ABN, Publish Date - May 11 , 2026 | 09:27 AM
మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యం 3’ ఈ నెల 21న విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ సందర్భంగా సినిమా హిట్టయితే మరో రెండు భాగాలు రావచ్చని మోహన్‌లాల్ తెలిపారు. క్లైమాక్స్ ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు.
‘దృశ్యం 3’ (Drishyam 3) హిట్టయిటే మరో రెండు భాగాలు కూడా రావొచ్చు. ఇందులో జార్జ్ కుట్టి ప్రతీ కదిలిక అలరిస్తుంది. ఆయన తన కుటుంబం కోసం ఏదైనా చేస్తాడు అని చెప్పేదే ఈ సినిమా. క్లైమాక్స్ ప్రత్యేకంగా ఉండనుంది’ అని హీరో మోహన్ లాల్ (Mohanlal) అన్నారు. ఆయన కథానాయకుడిగా జీతూ జోసెఫ్ (Jeethu Joseph) తెరకెక్కించిన చిత్రం ‘దృశ్యం 3’.
ఈ ఫ్రాంచెజీలోని మొదటి రెండు భాగాలు సాధించిన సంచలన విజయాలకు కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ కార్యక్రమంలో జీతూ జోసెఫ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో అంశాలు ఉంటాయి. అయితే ఈ చిత్రం మొత్తం అవే ఉంటాయని అధిక అంచనాలు పెట్టుకోకండి. ఇందులో కుట్టి, ఆయన కుటుంబ భావోద్వేగాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాను’ అని పేర్కొన్నారు.