సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దర్శకుడు.. సుందర్ మోసం చేసి బెదిరిస్తున్నాడు! కమిషనరేట్‌లో.. నిర్మాత ఫిర్యాదు

ABN, Publish Date - Apr 10 , 2026 | 09:16 AM

ప్రముఖ సినీ దర్శకుడు, సీనియ‌ర్ న‌టి ఖుష్బూ భ‌ర్త‌ సుందర్ తనను మోసం చేశారంటూ సినీ నిర్మాత మణికంఠ రామన్ ఆరోపించారు.

Sundar C

అసెంబ్లీ ఎన్నికల్లో పుదియ నీతి కట్చి (Puthiya Needhi Katchi (PNK) (అన్నాడీఎంకే కూటమి) తరపున మదురై సెంట్రల్ (Madurai Central Assembly Constituency) స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ సీనియ‌ర్ న‌టి ఖుష్బూ భ‌ర్త‌, సినీ దర్శకుడు, సుందర్ (Sundar C) తనను మోసం చేశారంటూ సినీ నిర్మాత మణికంఠ రామన్ ( Manikantan Raman) ఆరోపించారు. ఈ విషయంపై ఆయన చెన్నై నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఒక సినిమా నిర్మాణం కోసం ఇచ్చిన అడ్వాన్స్ సొమ్ము తిరిగివ్వకుండా తమను బెదిరిస్తున్నారని, ఆయనపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. కలగలప్పు 3 (Kalakalappu 3) మూవీ కోసం సుందర్‌ను సంప్రదించగా, రూ.20 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసేలా, సుందర్‌కి రెమ్యునరేషన్‌గా రూ.5 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నామ‌న్నారు.

ఈ ప్రాజెక్టు కోసం ముందస్తుగా సుందర్‌కి రూ.50 లక్షలు, ఇతర నటీ నటులకు రూ.59 లక్షలు అడ్వాన్స్ రూపేణా చెల్లించామ‌ని అయితే.. అనుకున్న ప్రకారం సుంద‌ర్‌ ప్రాజెక్టును పూర్తి చేయలేదని పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన దర్శకత్వం వహించిన 'అరణ్మనై-4' చిత్రం విడుదలై ఘన విజయం సాధించడంతో రెమ్యునరేషన్‌గా రూ.10 కోట్లు ఇవ్వాలని సుందర్ డిమాండ్ చేశాడ‌ని, సినిమా బడ్జెట్‌ను రూ.30 కోట్లకు పెంచేశాడ‌ని తెలిపారు.

ఈ విషయంపై పలుమార్లు అత‌నితో చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం రాలేదని దీంతో తాను అడ్వాన్స్‌గా ఇచ్చిన‌ సొమ్మును తిరిగి ఇవ్వాలని ద‌ర్శ‌కుడిని కోరగా నాటి నుంచి తమని బెదిరిస్తున్నాడ‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఈ ప‌రిస్థితుల దృష్ట్యా డైరెక్ట‌ర్‌ సుంద‌ర్‌పై కేసు నమోదు చేసి న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని నిర్మాత మణికంఠ రామన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 11:47 AM