Rajinikanth 173: ‘రజనీ-173’ దర్శకుడు క్లారిటీ
ABN, Publish Date - Feb 03 , 2026 | 09:59 AM
సూపర్‌స్టార్ రజనీకాంత్ 173వ (Rajinikanth 173) చిత్రం ఆడియన్స్‌ను సంతృప్తిపరిచేలా ఉంటుందని చిత్ర దర్శకుడు సిబి చక్రవర్తి (sibi chakravarthy ) పేర్కొన్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ 173వ (Rajinikanth 173) చిత్రం ఆడియన్స్‌ను సంతృప్తిపరిచేలా ఉంటుందని చిత్ర దర్శకుడు సిబి చక్రవర్తి (sibi chakravarthy ) పేర్కొన్నారు. అగ్ర నటుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్ళనున్న నేపథ్యంలో ‘విత్ లవ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న సిబి చక్రవర్తి ‘రజనీ173’ మూవీ గురించి మాట్లాడాడు. ఈ సినిమా గురించి చెబుతూ, ‘రజనీకాంత్ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం రావడంతో అనేక మంది నుంచి అభినందనలు, ప్రశంసలు వచ్చాయి. రజనీకాంత్ అభిమానిగా ఆయన ఫ్యాన్స్‌ను, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఒక్క విషయాన్ని చెబుతున్నాను. ఈ సినిమా చూసి థియేటర్ల నుంచి తృప్తిగా బయటకు వస్తారు' అని అన్నాడు. ఏ సినిమాను ప్రకటించినప్పుడు సుందర్. సి దర్శకుడు. అయితే పలు కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి వైదొలిగారు. తదుపరి సిబి చక్రవర్తిని దర్శకుడిగా ప్రకటించారు.