మామ కోసం వెనక్కి తగ్గిన అల్లుడు..
ABN, Publish Date - Aug 17 , 2026 | 06:12 PM
తమిళ చిత్రసీమతో పాటు దక్షిణ భారతదేశంలో ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్న భారీ చిత్రాల్లో జైలర్ 2, ఓం సినిమాలు ఉన్నాయి. మాజీ మామ అల్లుళ్ళు అయిన రజనీకాంత్, ధనుష్ ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
తమిళ చిత్రసీమతో పాటు దక్షిణ భారతదేశంలో ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్న భారీ చిత్రాల్లో జైలర్ 2 (Jailer 2), ఓం (OM) సినిమాలు ఉన్నాయి. మాజీ మామ అల్లుళ్ళు అయిన రజనీకాంత్, ధనుష్ ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మొదటి నుంచి కూడా జైలర్ 2 పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 15 న రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే జైలర్ సూపర్ హిట్ గా నిలవడంతో ఈ సీక్వెల్ కూడా పక్కా హిట్ అవుతోందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇక ఆలోపే.. నేను కూడా దసరా రేసులో ఉన్నాను అంటూ ధనుష్ దిగాడు. ఆయన నటించిన ఓం అక్టోబర్ 16 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అయితే కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ధనుష్ దసరా క్లాష్ నుంచి తెలివిగా తప్పుకుని, సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 చిత్రానికి బాక్సాఫీస్ వద్ద సోలో రిలీజ్ ఇచ్చేందుకు మార్గం సుగమం చేసినట్లు తెలుస్తోంది.దసరా పోరు నుంచి తప్పుకున్న ధనుష్, ఇప్పుడు తన చిత్రం ఓం ను దీపావళి బరిలో నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మాజీ మామ సినిమా కోసం ధనుష్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. అయితే ధనుష్ కి దీపావళీ రేస్ లో కూడా పోటీ లేకుండా లేదు.
ఈ ఏడాది వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ హిట్‌లతో ఫుల్ జోష్‌లో ఉంటూ, హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తున్న సూర్యతో ధనుష్ పోటీపడనున్నాడు. సూర్య కెరీర్‌లో 47వ చిత్రంగా తెరకెక్కుతున్న సూర్య47 ఈ దీపావళి పండుగ కానుకగా థియేటర్లలోకి రావడం దాదాపు ఖాయమైందనే టాక్ వినిపిస్తోంది. జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ పరిణామంతో దీపావళి రేసులో ధనుష్ ఓం, సూర్య చిత్రాల మధ్య నేరుగా బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడనుంది. కోలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోల పోటీపైనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒకవైపు రజినీకాంత్ కోసం దసరా స్థానాన్ని వదిలేసిన ధనుష్, హ్యాట్రిక్ హిట్ల ఊపులో ఉన్న సూర్యను దీపావళికి ఎంతవరకు ఢీకొట్టగలడనేది ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.