బూటుకాలుతో తన్నులు కూడా తిన్నాను!
ABN, Publish Date - Mar 02 , 2026 | 07:57 AM
చిత్రపరిశ్రమలో రెండో అధ్యాయాన్ని ఇపుడే ప్రారంభించానని స్టార్ హీరో ధనుష్ (Dhanush) అన్నారు.
చిత్రపరిశ్రమలో రెండో అధ్యాయాన్ని ఇపుడే ప్రారంభించానని స్టార్ హీరో ధనుష్ (Dhanush) అన్నారు. చెన్నైలోని ప్రముఖ విద్యా సంస్థ వేల్స్ యూనివర్సిటీ (Vels University)లో జరిగిన కల్చరల్ ఫెస్ట్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనకు లభించిన దాన్ని పెద్దల ఆశీర్వాదంగా భావించి, దాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేయాలి అని అన్నారు. చిత్ర పరిశ్రమలో 25 యేళ్ళ ప్రస్థానం అనేది చాలా చిన్నది, అందుకే సినీ ఇండస్ట్రీలో రెండో అధ్యాయాన్ని ఇప్పుడే ప్రారంభించాను అన్నారు.
'వేల్స్ వర్సి టీతో నాకు ఎంతగానో సంబంధం ఉంది. నా తొలి చిత్రం 'తుళ్కువదో ఇలమై' ఇక్కడే చిత్రీకరించారు. అంతేకాదు ఆ చిత్రంలో ఒక సన్నివేశంలో వేల్స్ వర్శిటీ అధినేత, సినీ నిర్మాత డాక్టర్ ఐసర్ కె గణేష్ బూటుకాలుతో తన్నులు కూడా తిన్నాను. పాఠశాల, కాలేజీ రోజులే ప్రతి ఒక్కరి జీవితంలో మంచి రోజులు. మెడిటేషన్, మేనిఫెస్టేషన్ ఈ రెండు అంశాలను అనుసరిస్తే ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ఉపకరణాలుగా పనిచేస్తాయి' అని ధనుష్ పేర్కొన్నారు.