సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

23 యేళ్ల కుర్రోడు చెప్పిన.. కథను నమ్మి సినిమా తీశారు.

ABN, Publish Date - Mar 15 , 2026 | 01:47 PM

ఒక 23 యేళ్ళ కుర్రోడు చెప్పిన కథను 'నమ్మి 'యూత్' చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కరుప్పయ్య సి.రామ్ ధైర్యానికి హ్యాట్సాఫ్ అని ప్రముఖ హీరో ధనుష్ అన్నారు.

Dhanush

ఒక 23 యేళ్ళ కుర్రోడు చెప్పిన కథను 'నమ్మి 'యూత్' చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కరుప్పయ్య సి.రామ్ ధైర్యానికి హ్యాట్సాఫ్ అని ప్రముఖ హీరో ధనుష్ (Dhanush) అన్నారు. పార్వతా ఎంటర్టై న్మెంట్ పతాకంపై నిర్మాత కరుప్పయ్య సి. రామ్ నిర్మాణంలో రూపొందిన చిత్రం యూత్ (Youth). 'ఆసురన్', 'విడు దలై-2' వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కెన్ కరుణాస్ (Ken Karunas) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

పాఠశాల బాల్య జీవితాన్ని ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన ఈ చిత్రానికి కెన్ కరుణాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు హీరోగా నటించారు. అనిష్మా (Anishma), మీనాక్షి దినేష్, ప్రియాన్షి యాదవ్ హీరోయిన్లు. దేవదర్షిణి, సురాజ్ వెంజరమూడు ముఖ్య పాత్రలను పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ ఐహించ‌ని ఆద‌ర‌ణ ద‌క్కించుకుని అమాంతం అంచ‌నాలు పెంచేసింది. ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుక తాజాగా చెన్నైలో జరిగింది.

కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran), స్టార్ హీరో ధనుష్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించి సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వెట్రిమారన్ మాట్లాడుతూ.. 'కెన్ కరుణాస్ నటుడిగా, దర్శకుడుగా రాణిస్తున్నారు. కెన్‌కు ధనుష్ ఇచ్చిన నమ్మకం, మద్దతును మాటల్లో వర్ణించలేం. కెన్ను నాకంటే ధనుష్ అధికంగా నమ్మారు' అని అన్నారు.

హీరో ధనుష్ మాట్లాడుతూ.. 'నిర్మాతకు ధన్యవాదాలు. 23 యేళ్ల కుర్రోడు చెప్పిన కథను నమ్మి సినిమా తీసిన నిర్మాత కరుప్పయ్య ధైర్యాన్ని మెచ్చుకోవాలి' అన్నారు. దర్శక హీరో కెన్ కరుణాస్ మాట్లాడుతూ.. 'నాపై నమ్మకం ఉంచి ఈ సినిమాలో నటించిన నటీనటులకు, పనిచే సిన సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. నాలోని ప్రతి భను గుర్తించి, ప్రోత్సహించిన దర్శకుడు వెట్రిమారన్ కు, నన్ను హీరోగా పరిచయం చేసిన దివంగత తామి రకు రుణపడి ఉంటా' అని పేర్కొన్నారు. కాగా ఈ మూవీ త్వ‌ర‌లోనే తెలుగులోనూ విడుద‌ల కానుంది.

Updated Date - Mar 15 , 2026 | 01:50 PM