'ఓం' అంటున్న ధనుష్! కొత్త సినిమా.. టైటిల్ గ్లింప్స్ అదిరింది
ABN, Publish Date - Jun 18 , 2026 | 10:18 PM
కర సినిమా తర్వాత తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తోన్న 55వ చిత్రం ఓం.
కర సినిమా తర్వాత తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తోన్న 55వ చిత్రం ఓం. తాజాగా గురువారం రాత్రి ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తూ మేకర్స్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్టేట్ ఇచ్చారు. సినమాకు ఓం అనే పేరు ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ ఓ చిన్నపాటి గ్లిమ్స్ వీడియో విడుదల చేశారు.
రెండేండ్ల క్రితం శివ కార్తికేయన్ హీరోగా వచ్చి సంచలన విజయం సొంతం చేసుకున్న అమరన్ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియ స్వామి ( Rajkumar Periasamy)ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో సాయి పల్లవి (Sai Pallavi), శ్రీలీల కథానాయికలు.
షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీని దసరా సందర్భంగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ఎదుటకు తీసుకు రానున్నారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన వీడియో సైతం మూవీపై కొత్త క్యూరియాసిటీని తీసుకు వస్తుంది. మీరూ ఓ లుక్ వేయండి.