సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓటీటీలోనైనా 'కర' హిట్ కొడతాడా

ABN, Publish Date - May 23 , 2026 | 04:56 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర (Kara). పోరు తొజిల్ లాంటి సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను అందించిన దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

Kara

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర (Kara). పోరు తొజిల్ లాంటి సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను అందించిన దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ ను అందుకుంది. రిలీజ్ అయ్యి నెల కూడా కాకముందే కర ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై అలరించేందుకు రెడీ అయిపోయింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. థియేటర్ రన్ ముగిసిన నెల రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 28 నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఒకేసారి అందుబాటులోకి రానుంది.


కర కథ విషయానికొస్తే.. కరస్వామి (ధనుష్) ఒక ప్రొఫెషనల్ దొంగ. కానీ, తాను ప్రాణంగా ప్రేమించిన మల్లి (మమితా బైజు) కోసం ఆ నేర జీవితాన్ని వదిలేసి, ఒక మంచి హోటల్ పెట్టుకుని బుద్ధిగా బతకాలని నిర్ణయించుకుంటాడు. హోటల్ బిజినెస్ పెట్టుబడి కోసం తన ఊరిలో ఉన్న పొలం కాగితాలను బ్యాంకు నుండి విడిపించాలని ప్లాన్ చేస్తాడు. ఆ క్రమంలో ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉంటున్న తన తండ్రి (కేఎస్ రవికుమార్) దగ్గరకు వెళ్తాడు. కానీ, అక్కడ ఊహించని కొన్ని ఘోర పరిణామాలు జరుగుతాయి. ఒక పెద్ద ముఠా వల్ల కర తన తండ్రిని కోల్పోతాడు. అసలు కర తన తండ్రికి ఎందుకు అన్ని ఏళ్లు దూరంగా ఉన్నాడు? ఒక ప్రత్యేకమైన బ్యాంకును మాత్రమే అతను ఎందుకు టార్గెట్ చేసి భారీ దొంగతనానికి ప్లాన్ చేశాడు? చివరికి తన భార్యకు ఇచ్చిన మాటను కర నిలబెట్టుకున్నాడా లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


కొన్నేళ్ళుగా ధనుష్ వరుస విజయాలను అందుకుంటూనే వస్తున్నాడు. హీరోగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా మంచి విజయాలను అందుకున్నాడు. ఆ నమ్మకంతోనే ప్రేక్షకులు కరపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. కానీ, ఈసారి ధనుష్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. పాతకాలం కథ కావడం, రొటీన్ గా ఉండడంతో ప్రేక్షకులు కరను ఆదరించలేకపోయారు. మరి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన ధనుష్ ఓటీటీలో అయినా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Updated Date - May 23 , 2026 | 05:51 PM