Dhanush: ఆ సినిమా ఒక మాస్టర్ పీస్.. ధనుష్ రివ్యూ వైరల్
ABN, Publish Date - Jan 13 , 2026 | 09:37 PM
మంచి సినిమా ఏ భాషల్లో వచ్చినా కూడా ప్రేక్షకులు చూస్తారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు హీరోలు కూడా ఒక మంచి సినిమాను ప్రశంసించడానికి ఏనాడు వెనుకాడలేదు.
Dhanush: మంచి సినిమా ఏ భాషల్లో వచ్చినా కూడా ప్రేక్షకులు చూస్తారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు హీరోలు కూడా ఒక మంచి సినిమాను ప్రశంసించడానికి ఏనాడు వెనుకాడలేదు. అది కేవలం టాలీవుడ్ హీరోలు మాత్రమే కాదు.. కోలీవుడ్ హీరోలు కూడా. ముఖ్యంగా స్టార్ హీరో ధనుష్ (Dhanush).. మంచి సినిమాకు ఎప్పుడు అండగా నిలబడతాడు. తాజాగా ధనుష్ మలయాళంలో వచ్చిన ఎకో (Eko) మూవీపై ప్రశంసలు కురిపించాడు. సినిమా చాలా బావుందని తెలుపుతూ సోషల్ మీడియాలో తనదైన రీతిలో రివ్యూ ఇచ్చాడు.
' మలయాళ చిత్రం 'ఎకో' ఒక కళాఖండం. నటి బియానా మోమిన్ అత్యున్నత గౌరవాలకు అర్హురాలు. ప్రపంచ స్థాయి ప్రదర్శన ఇచ్చారు;' అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నిజంగా ఎకో మూవీకి ధనుష్ పోస్ట్ మరింత బూస్ట్ ని ఇచ్చింది. ప్రస్తుతం ఎకో మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఎకో సినిమా రూ. 50 కోట్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది.
ఎకో కథ గురించి చెప్పాలంటే.. కేరళ, కర్ణాటక సరిహద్దుల్లోని ఒక మారుమూల ఎత్తైన కొండ ప్రాంతమే ఈ కథకు వేదిక. కురియాచన్ (సౌరభ్ సచ్ దేవ్) అనే వ్యక్తి కోసం అటు పోలీసులు.. ఇటు నేవీ అధికారులు వెతుకుతూ ఉంటారు. అతని భార్య మిలాతియా (బియానా మోమిన్) ఒంటరిగా కొండపై ఉన్న ఇంట్లో నివసిస్తూ ఉంటుంది. ఆమె దగ్గరకు ఎవరైనా వెళ్ళాలి అంటే చాలా క్రూరంగా ఉండే మలేషియా కుక్కలను దాటుకొని వెళ్ళాలి. ఇక ఆమెకు కాపలాగా పీయూష్ (సందీప్ ప్రదీప్) వస్తాడు. కురియాచన్ ని వెతక్కుంటూ ఆ అడవికి చాలామంది వస్తారు. కానీ, వారందరిని కుక్కలు చంపేస్తాయి. అసలు కురియాచన్ ఎవరు.. ? అతనిని ఎందుకు చంపాలనుకుంటారు.. ? ఆ కుక్కలను శాసిస్తుంది ఎవరు.. ? పీయూష్ గతం ఏంటి.. ? అనేది కథ. మరి ఈ సినిమా ముందు ముందు ఎలాంటి రికార్డులు అందుకుంటుందో చూడాలి.