సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sreeleela: ధ‌నుస్‌తో.. శ్రీలీల‌ రోమాన్స్‌! సాయి ప‌ల్ల‌వి.. ఔట్‌

ABN, Publish Date - Feb 01 , 2026 | 11:12 AM

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది  శ్రీలీల(Sreeleela). బాలీవుడ్ సినిమాల్లోనూ అవకాశం అందుకుంది. ‘పరాశక్తి’తో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

Sreeleela

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది  శ్రీలీల (Sreeleela). బాలీవుడ్ సినిమాల్లోనూ అవకాశం అందుకుంది. ‘పరాశక్తి’తో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే మరో తమిళ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.  

ధనుష్‌ (Dhanush) ప్రధాన పాత్రలో రాజ్‌కుమార్‌ పెరియసామి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  ఆయన  హీరోగా నటిస్తున్న 55వ చిత్రమిది. 'డీ 55' (D55) వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో  శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.

ఈ విషయాన్ని తెలుపుతూ.. శనివారం ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలను పంచుకుంది చిత్ర బృందం. శ్రీలీల తమిళంలో నటించిన 'పరాశక్తి' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమాపై ఆమె బాగా హోప్స్ పెట్టుకుంది. ఈసారైనా విజయం వరిస్తుందేమో చూడాలి. 

అయితే.. రెండు రోజుల క్రితం వ‌ర‌కు కూడా ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించ‌నున్న‌ట్లు బాగా ప్ర‌చారం జ‌రిగింది. అలాంటిది స‌డ‌న్‌గా సాయి ప‌ల్ల‌వి స్థానంలో శ్రీలీల ఎంట్రీ ఇవ్వ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది.

Updated Date - Feb 01 , 2026 | 04:04 PM