సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'వడ చెన్నై' యూనివర్స్‌లో బిగ్ ట్విస్ట్!

ABN, Publish Date - Jun 04 , 2026 | 03:53 PM

అభిమానుల్లో మల్టీస్టారర్ చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. అయితే ఒక సీనియర్ స్టార్, మరో యంగ్ హీరో కలిసి నటించడం మనం తరచూ చూస్తూనే ఉంటాం

అభిమానుల్లో మల్టీస్టారర్ చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. అయితే ఒక సీనియర్ స్టార్, మరో యంగ్ హీరో కలిసి నటించడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ, గత రెండు దశాబ్దాలుగా బాక్సాఫీస్ దగ్గర నువ్వా-నేనా అంటూ పోటీ పడుతున్న ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే స్క్రీన్‌ను పంచుకోబోతున్నారన్న న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.

తమిళ చిత్ర పరిశ్రమలో రజనీకాంత్ - కమల్ హాసన్, విజయ్ - అజిత్ మధ్య ఎలాంటి నెక్-టు-నెక్ కాంపిటీషన్ ఉండేదో.. గత 20 ఏళ్లుగా ధనుష్, శింబు మధ్య కూడా అలాంటి క్రేజీ రైవల్రీ నడుస్తోంది. ఒకరిది విలక్షణమైన నటనతో కూడిన అద్భుతమైన మాస్ ఇమేజ్ అయితే.. మరొకరిది స్టైల్, స్వాగ్‌తో కూడిన ఊరమాస్ ఫాలోయింగ్. దశాబ్దాలుగా కోలీవుడ్‌లో రాణిస్తున్న ఈ ఇద్దరు మాస్ ఐకాన్స్ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపించబోతున్నారనే ప్రచారం ఇద్దరి అభిమానుల్లో జోష్ నింపుతోంది.

తమిళ ఇండస్ట్రీలో కాదు, టోటల్ సౌత్ సినిమాలోనే మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్‌గా మారిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తోంది మరెవరో కాదు కల్ట్ డైరెక్టర్ వెట్రిమారన్ అట! ధనుష్, వెట్రిమారన్‌లది టాలీవుడ్‌లో రాజమౌళి, జూ. ఎన్టీఆర్ లాంటి ఒక అన్‌స్టాపబుల్ కాంబినేషన్. వీరు కలిసి చేసిన 'పొల్లాధవన్, ఆడుకలం, అసురన్, వడ చెన్నై'... నాలుగు సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాకుండా జాతీయ అవార్డులను కూడా కొల్లగొట్టాయి. ప్రస్తుతం వెట్రిమారన్ శింబుతో 'అరసన్' మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా గతంలో ధనుష్ చేసిన క్లాసిక్ హిట్ 'వడ చెన్నై' గ్యాంగ్ స్టర్ ప్రపంచంతో ముడిపడి ఉంటుందని ఇండస్ట్రీ టాక్.

'వడ చెన్నై'లో (Vada Chennai) ఐకానిక్ రోల్ పోషించిన ధనుష్‌ను... శింబు చేస్తున్న మూవీలో పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. స్క్రీన్ పై కనిపించేది కొన్ని నిమిషాలే అయినప్పటికీ.. కథను పూర్తిగా మలుపు తిప్పే కీలకమైన పాత్రగా డిజైన్ చేశారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ధనుష్ నటన, శింబు స్వాగ్, వెట్రిమారన్ మేకింగ్... ఈ మూడు ఎలిమెంట్స్ కలిస్తే అది కేవలం సినిమా కాదు, బాక్సాఫీస్ దగ్గర ఒక సునామీనే అవుతుందని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. దశాబ్దాలుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఈ కాంబో గనుక అఫీషియల్‌గా అనౌన్స్ అయితే... తమిళ సినిమా రికార్డులన్నీ తిరగరాయొచ్చని అభిమానులు ఆశపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!

Updated Date - Jun 04 , 2026 | 03:53 PM