సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

డిమాంటి కాలనీ 3.. విడుదలకు సిద్ధం

ABN, Publish Date - Apr 17 , 2026 | 09:09 AM

డిమాంటి కాలనీ ఫ్రాంచైజీలో వస్తున్న మరో చిత్రం డిమాంటి కాలనీ 3 ది ఎండ్ ఈజ్ టూ ఫార్ అవే సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు రెడీ అవుతోంది.

Demonte Colony 3

అరుళ్ నిధి (Arulnithi) హీరోగా డిమాంటి కాలనీ (Demonte Colony) ఫ్రాంచైజీలో వస్తున్న మరో చిత్రం డిమాంటి కాలనీ 3 ది ఎండ్ ఈజ్ టూ ఫార్ అవే (Demonte Colony 3: The End Is Too Far Away) . ఇప్ప‌టికే రెండు భాగాలుగా వ‌చ్చిన ఈ సిన‌మాలు ఒక దానిని మించి మ‌రోటి భారీ విజ‌యాన్ని ద‌క్కించుకుని సినిమాకంటూ ఓ ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్‌ ఏర్పడింది.

అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) దర్శకత్వం వహించిన చిత్రాన్ని సుధన్ సుందరం, మనీష్ సింఘాల్, దుర్గా రామ్ చౌదరి సంయు క్తంగా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), ఆండీ జాస్కెలైన్, గురు సోమసుందరం (Guru Somasundaram), కదిర్, ఆషిక్ హుస్సేన్, అర్చన రవిచంద్రన్ కీల‌క పాత్ర‌ల్లో నటించారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రం తమిళనాడు డిస్ట్రి బ్యూషన్ హక్కులను ఫైప్టార్ కె. సెంథిల్ దక్కించుకున్నారు.

థియేట్రికల్ పంపిణీలో వరుసగా అనేక విజయవంతమైన చిత్రాలను అందించడం ద్వారా ఫైవ్ స్టార్ కె. సెంథిల్ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఆయన గతంలో 'డీడీ రిటర్న్స్', 'గరుడన్', 'మహారాజా', 'బైసన్' వంటి విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేశారు. దీంతో ఇపుడు ఈ చిత్రంపై భారీ అంచనాలు నెల కొన్నాయి.

Updated Date - Apr 17 , 2026 | 11:17 AM