సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దేవదాస్ కథ స్ఫూర్తితో.. 'డీసీ'

ABN, Publish Date - Aug 07 , 2026 | 09:43 AM

'డీసీ' సినిమా దేవదాస్ కథ స్ఫూర్తితో గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలో తెరకెక్కిందని దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెలిపారు.

Arun Matheswaran

అందరికీ తెలిసిన దేవదాస్‌ కథను ఓ గ్యాంగ్‌స్టర్‌ ప్రపంచంలో చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మొదలైన సినిమా ‘డీసీ’ (DC) అని దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్ (Arun Matheswaran) అన్నారు. ‘రాకీ’, ‘సాని కాయిదం’ చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన ఆయన, ఇటీవలే ధనుశ్‌తో తీసిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’తో జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘డీసీ’. దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్ (Lokesh Kanagaraj), వామికా గబ్బి జంటగా సన్‌ పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్‌పై కళానిధి మారన్ (Kalanithi Maran) నిర్మించారు. తెలుగులో ఏషియన్‌ సినిమాస్‌ విడుదల చేస్తోంది.

నేడు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ‘డీసీ’ విశేషాలను మీడియాతో ముచ్చటించారు అరుణ్‌. ‘నేను ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్న కథ ఇది. ఓ పార్టీలో లోకేశ్‌ను కలసినప్పుడు ఈ కథ చెప్పాను. ఆయనకు విపరీతంగా నచ్చడంతో వెంటనే అంగీకరించారు. ఓ వైల్డ్‌ గ్యాంగ్‌స్టర్‌ తన ప్రయాణంలో పార్వతి, చంద్రను కలిశాక ఎలాంటి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయనేది ఈ చిత్రం కథాంశం.

నేను ఇప్పటికే దర్శకులు భారతీరాజా, సెల్వరాఘవన్‌, ధనుశ్‌లను డైరెక్ట్‌ చేయడంతో లోకేశ్‌తో పనిచేయడం మరింత సులువైంది. నా విజన్‌ను ఆయన బాగా అర్థం చేసుకుని అద్బుతమైన పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. సినిమాలోని ప్రతీ పాత్రను బలంగా డిజైన్‌ చేయడంతో ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ఇందులోని భావోద్వేగాలు, యాక్షన్‌, విజువల్స్‌, అనిరుధ్‌ సంగీతం ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తాయి అని చెప్పారు.

Updated Date - Aug 07 , 2026 | 10:25 AM