దర్శన్ కేసు విచారణ.. తడబడ్డ నటులు! క్రాస్ ఎగ్జామినేషన్ కోసం అనుమతి
ABN, Publish Date - Oct 14 , 2026 | 08:15 AM
రేణుకాస్వామి హత్య కేసులో శాండల్వుడ్ నటులు చిక్కణ్ణ, యశస్ సూర్య విచారణకు హాజరయ్యారు. చిక్కణ్ణ ఆందోళన నేపథ్యంలో విచారణ వాయిదా పడగా, మరోసారి హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసు (Renukaswamy Murder Case)కు సంబంధించి విచారణ జరుపుతున్న సిట్ అధికారుల ముందుకు శాండల్వుడ్ (Sandalwood) నటులు యశస్ సూర్య (Yashas Surya), చిక్కణ్ణ (Chikkanna) మంగళవారం హాజరయ్యారు. కోర్టు ముందుకు రాగానే చిక్కణ్ణ ఒక్కసారిగా ఆందోళనకు లోనై మాట్లాడేందుకు వెనుకంజవేశాడు. దీంతో యశస్ను మాత్రమే కొన్ని ప్రశ్నలు వేశారు. క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమతులు కోరారు.
ఇందుకు కోర్టు సమ్మతించింది. యశస్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగా చిక్కణ్ణ ఆందోళన చెందారు. దీంతో న్యాయాధికారి మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. వాస్తవానికి బుధవారం విచారణకు చిక్కణ్ణ రావాలని సూచించారు. అయితే ఇతర సాక్షులు వస్తున్నందున తాత్కాలికంగా వాయిదా వేశారు. రేణుకాస్వామి హత్య జరిగిన రోజు స్టోనీ బ్రూక్స్ రెస్టారెంట్ (Stone Brook Restaurant)లో పార్టీ చేసు కున్నారు. దర్శన్ (Darshan), ప్రదోశ్, నాగరాజ్, వినయ్ రెస్టారెంట్లో ఉన్నారు. అప్పుడు దర్శన్ సహా ఇతరులు ఏం చర్చ జరిపారనే అంశంపై ఆరా తీసేందుకు చిక్కణకు నోటీసులు ఇచ్చారు.