సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jason Sanjay: మా ఇద్దరి.. ఆలోచనలు ఒకటే! నా ఫ‌స్ట్‌ ఛాయిస్.. మా డాడీనే

ABN, Publish Date - Aug 03 , 2026 | 08:05 AM

హాలీవుడ్ నటుడు జేసన్ స్టేత‌మ్ నుంచి అవకాశం వ‌స్తే తన తొలి ఛాయిస్ మాత్రం మా డాడీనే అని హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ అన్నారు.

Jason Sanjay

సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిన‌ చిత్రం సిగ్మా (Sigma) గత నెల 30వ తేదీన విడుదల కావాల్సి ఉండగా, ఆగ‌స్టు నెలకు వాయిదా పడింది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా జాసన్ సంజయ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అయ్యాయి.

'నా కంటూ ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక పేరు తెచ్చు కోవాలని మా నాన్న ఆకాంక్ష. నేను కూడా అదే కోరుకున్నాను. మా ఇద్దరి ఆలోచనలు ఒకటే. 'నీకు ఏ సహాయం కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు. కానీ, నువ్వే స్వయంగా ప్రయత్నించాలి' అని నాన్న చెప్పే వారు. అలాగే, జీవితంలోని అనుభవాలను స్వయంగా ఎదుర్కొని, వాటి నుంచి నేర్చుకోవాలన్నదే ఆయన ఆకాంక్ష. నాకు ఎల్లవేళలా అండగా నిలిచిన మా నాన్న, అమ్మ, మా కుటుంబానికి కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు.

హాలీవుడ్ నటుడు జాసన్ స్టాథమ్ (Jason Statham) నుంచి అవకాశం వ‌స్తే తన తొలి ఛాయిస్ మాత్రం మా డాడీనే అని తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో విజయ్ (vijay) కుమారుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) అన్నారు. 'సిగ్మా' సినిమా చూశాక మీ పేరుతో ఉండే హాలీవుడ్ నటుడు జాసన్ స్టాథమ్ ఫోన్ చేసి 'హాలీవుడ్‌లో ఒక సినిమా చేద్దామని ఆఫర్ ఇస్తే, భారతదేశం నుంచి ఏ గొప్ప నటుడిని తీసుకెళతారు? అంటూ ఓ విలేఖ‌రి అడిగిన ప్రశ్నకు జాసన్ క్షణం కూడా ఆలోచన చేయకుండా.. 'నాకు మొదట గుర్తొచ్చేది మా నాన్నగారే. తొలి ఛాయిస్‌ ఆయనే, వాళ్ళిద్దరూ కలిస్తే అది ఒక ఫన్నీ కాంబినేషన్ అవుతుంది. నేను ఇప్పుడు చేసిన ఈ వ్యాఖ్యలు హాలీవుడ్ నటుడు జాసన్ చూడాలని కోరు కుంటున్నాను' అంటూ బదులిచ్చాడు.

Updated Date - Aug 03 , 2026 | 08:05 AM