సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

స్పా సెంటర్ లో నటికి  ఏం జరిగిందంటే.. 

ABN, Publish Date - Aug 13 , 2026 | 08:12 AM

ప్రముఖ తమిళ నటి వినోదిని తన మంగళసూత్రం స్పా సెంటర్‌లో మాయమైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రముఖ తమిళ నటి వినోదిని (Vinothini) తన మంగళసూత్రం స్పా సెంటర్‌లో మాయమైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దివంగత దర్శకుడు బాలుమహేంద్ర తెరకెక్కించిన ‘వణ్ణ వణ్ణ పూక్కల్‌’, ‘మరుబడియుం’ వంటి చిత్రాల్లో నటించిన వినోదిని.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. తాజాగా తనకు ఎదురైన ఈ ఘటనను ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

‘మానసిక ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందాలని భావించి గత శుక్రవారం ఒక స్పా సెంటర్‌కు వెళ్లాను. మసాజ్ ప్రారంభించే ముందు నా మెడలో ఉన్న బంగారు మంగళసూత్రాన్ని తీసేయాలని అక్కడి సిబ్బంది సూచించారు. వారి మాట ప్రకారం తాళిని తీసి వారికి ఇవ్వగా, వారు దానిని ఒక టబ్‌లో ఉంచారు. మసాజ్ పూర్తయ్యాక నిద్రమత్తులో ఉండటంతో నా మంగళసూత్రాన్ని తీసుకోవడం మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాను. మరుసటి రోజు మా కుటుంబంలో ఒకరు మరణించడంతో ఆ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమయ్యాను. దీంతో మంగళసూత్రం విషయం కూడా గుర్తుకు రాలేదు. ఆదివారం నా మెడలో మంగళసూత్రం లేదనే విషయం గుర్తుకు రావడంతో వెంటనే స్పా సెంటర్‌కు వెళ్లి సిబ్బందిని అడిగాను. అయితే, అది అక్కడ లేదని వారు చెప్పారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాను. ఈ విషయాన్ని  చెబుతున్నాను అంటే.. స్పా సెంటర్లకు  వెళ్లేటప్పుడు విలువైన ఆభరణాలు ధరించకుండా ఉండాలని అందరికీ సూచించాలనుకుంటున్నాను. చిన్న నిర్లక్ష్యం కూడా ఇలాంటి ఇబ్బందులకు కారణమవుతుంది. నా మంగళసూత్రం కేవలం ఒక బంగారు ఆభరణం మాత్రమే కాదు.. అది నాకు ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది. పోలీసులు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి నా మంగళసూత్రాన్ని గుర్తించి తిరిగి అప్పగిస్తారనే నమ్మకం నాకు ఉందిఈ ఘటన నాకు ఒక పాఠం నేర్పింది. అందుకే నేను కూడా జాగ్రత్తగా ఉండాలని, ఇతరులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను.’’ అని నటి వినోదిని పేర్కొన్నారు.

ALSO READ:

Nagarjuna: మళ్లీ థియేటర్లలోకి కింగ్ నాగార్జున క్లాసిక్

Raviteja: మూడు ముడులతో.. ఫ్యామిలీ డ్రామాగా

Updated Date - Aug 13 , 2026 | 08:33 AM