‘రాయన్'కు జాతీయ అవార్డుపై విమర్శలు.. సీరియస్ అయిన ధనుష్
ABN, Publish Date - Jul 27 , 2026 | 08:50 AM
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ అవార్డుల్లో హీరో ధనుష్ (Dhanush) నటించిన రాయన్ (Raayan) చిత్రానికి రెండు అవార్డులు రాగా, దీనిపై అనేక విమర్శలు వచ్చాయి.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ అవార్డుల్లో హీరో ధనుష్ (Dhanush) నటించిన రాయన్ (Raayan) చిత్రానికి రెండు అవార్డులు రాగా, దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం తిరువళ్ళూరు జిల్లాలోని ఓ వైద్య కళాశాలలో ధనుష్ అభిమాన సంఘం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ధనుష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రాయన్' చిత్రానికి జాతీయ అవార్డు రావడం వెనుక ఎలాంటి సిఫార్సు లేదు. ఒక తమిళుడిగా జాతీయ అవార్డులు వచ్చాయి. ఇందుకుగాను నన్ను భుజం తట్టి ప్రోత్సహించండి. 'రాయన్' చిత్రం కంటే అనేక చిత్రాలు చాలా బాగున్నాయని, వాటికి అవార్డులు ఇవ్వలేదంటూ అభిమానులు విమర్శిస్తున్నారు.
మహరాజా, మెయ్యళగన్ చిత్రాలు మెరుగ్గా ఉండవచ్చని.. కానీ, నేను నటించిన 'పుదుపేట', '3', 'మయక్కం ఎన్న', 'మరియాన్', 'వడ చెన్నై', 'కర్ణ న్' వంటి అనేక చిత్రాలను జాతీయ అవార్డు వరిస్తుందని అనుకున్నాం. కానీ, రాలేదు. 'రాయన్'కు జాతీయ అవార్డు ఎందుకు? అని ప్రశ్నించే వారు.. పైన పేర్కొన్న చిత్రాలకు అవార్డులు ఎందుకు ఇవ్వలేదని అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు' అని ధనుష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ధనుస్ మీట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది.