సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఉప ముఖ్యమంత్రిగా త్రిష.. మాజీ మంత్రి

ABN, Publish Date - Jun 28 , 2026 | 02:40 PM

త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు, సీఎం విజ‌య్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై అన్నాడీఎంకే మాజీమంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Vijay, Trisha

స్నేహం, బాంధవ్యంకు ప్రభుత్వ ఉద్యోగాలు కట్టబెడుతున్న ముఖ్యమంత్రి విజయ్ (Vijay), మేడం త్రిష (Trisha)కు ఉపము ఖ్యమంత్రి పదవి అందించినా ఆశ్చర్యం లేదని అన్నాడీఎంకే (AIADMK) మాజీ మంత్రి ఉదయకుమార్ (Udayakumar) ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినీ నిర్మాత జ‌న నాయ‌గ‌న్ మూవీని నిర్మించిన‌ కేవీఎన్ ప్రోడ‌క్ష‌న్స్ (KVN Productions) వెంకటనారాయణ (Venkat K. Narayana) ను రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా టీవీకే ప్రభుత్వం నియమించిందన్నారు. అంతేగాక మేనేజర్ జగదీష్ పళనిస్వామి, తన వ్యూహకర్త జాన్ ఆరోగ్య స్వామి తదితరులను సీఎం విజయ్ నియమించుకున్నారని తెలిపారు.

8 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు ఢిల్లీ ప్రాతినిధ్యం వహించేందుకు రాష్ట్రానికి చెందిన వారు ఒక్కరు కూడా కనిపించలేదా అని ప్రశ్నించారు. విజయ్ సినిమాను నిర్మించిన‌ పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఆ ప‌ద‌వికి నియమించడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. ముఖ్యమంత్రి విజయ్ పనితీరు ఇలా ఉందని ఈ నేప‌థ్యంలో మున్ముందు మేడం త్రిషను ఉప ముఖ్యమంత్రి (deputy cm) గా నియమించినా ఆశ్చర్యం లేదని ఉదయకుమార్ ఎద్దేవా చేశారు.

Updated Date - Jun 28 , 2026 | 03:50 PM