Mahima Nambiar: అందరికీ మహిమా.. కానీ అసలు పేరు మాత్రం వేరే!

ABN , Publish Date - Oct 04 , 2026 | 07:28 AM

తెలుగు తెరపై మరో మలయాళ మ్యాజిక్‌.. మహిమా నంబియార్‌ (Mahima Nambiar). ‘మండాడి’ అనువాద చిత్రంతో ఇటీవలే తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఈసారి స్ట్రయిట్‌ తెలుగు సినిమా ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’తో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

తెలుగు తెరపై మరో మలయాళ మ్యాజిక్‌.. మహిమా నంబియార్‌ (Mahima Nambiar). ‘మండాడి’ అనువాద చిత్రంతో ఇటీవలే తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఈసారి స్ట్రయిట్‌ తెలుగు సినిమా ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’తో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న విశేషాలు...

పేరు మారింది

నా అసలు పేరు గోపికా పాలట్‌ చిరక్కరవీట్టిల్‌. కేరళలోని కాసర్‌గడ్‌ మా సొంతూరు. 2010లో ‘కార్యస్థాన్‌’తో మలయాళ ఇండస్ట్రీకి పరిచయమయ్యా. అప్పుడు నా వయసు 15 ఏళ్లు. చదువు పూర్తి చేయాలని రెండేళ్లు బ్రేక్‌ తీసుకొని, తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చా. అప్పటికే ఒక గోపిక ఉంది కాబట్టి పేరు మార్చుకోమన్నారు. దాంతో మహిమా నంబియార్‌నయ్యా.

డ్యాన్సంటే పిచ్చి

నాకు చిన్నప్పటి నుంచి సంగీతం, డ్యాన్స్‌ అంటే ఇష్టం. ఆ పిచ్చితోనే ‘చంద్రముఖి 2’ ఒప్పుకొన్నా. డ్యాన్స్‌కు సంబంధించిన మూవీ చేయాలనే కోరిక ఉంది. సినిమాలో పాటలు పాడాలని కూడా ఉంది. ఈ రెండూ ఎప్పుడు తీరుతాయో?!

ఫుడీ అనుకోరు... కానీ...

నన్ను చూస్తే ఎవ్వరూ ఫుడీ అనుకోరు. కానీ నేను చాలా బాగా తింటా. వెజ్‌-నాన్‌వెజ్‌... ఏదైనా లాగించేస్తా. కేరళ సంప్రదాయ తిండి అంటేచాలా ఇష్టం. పనసపండు మసాలా కూర, బీన్స్‌, చేపలు, రొయ్యలు ఇష్టంగా తింటా. ఒకప్పుడు స్వీట్స్‌ కూడా బాగా తినేదాన్ని. ఇప్పుడు కొంచెం తగ్గించానంతే.


ప్రేమను నమ్ముతా...

ఒక నిర్దిష్ట వయసులో ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలనే ఒత్తిడికి నేటితరం లోనుకావొద్దు. మీకు ఏది సరైనదనిపిస్తుందో అదే చేయండి. అలాగే ప్రేమ అనేది సూత్రాలకు కట్టుబడి ఉండదు. నేను ప్రేమను నమ్ముతా. ఆ ప్రక్రియ జరగాల్సినప్పుడు దానంతట అదే జరుగుతుంది.

అలాంటి వ్యాఖ్యలొద్దు...

నా పేరుతో ఫేక్‌ అకౌంట్లు చాలానే ఉన్నాయి. వాటిలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇన్‌స్టా, యూట్యూబ్‌ చానెల్‌లో నా ఇంటర్వ్యూల కింద కూడా ఏవేవో కామెంట్లు పెడుతుంటారు. ఇతరుల వ్యక్తిగత విషయాలను కించపరిచేలా మాట్లాడటం మర్యాద కాదు. నేనైతే ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ జోక్యం చేసుకోను. సెలబ్రిటీలను అగౌరవపరిచే వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు.

చాలా ఎమోషనల్‌..

నాకు అదేపనిగా మాట్లాడడం ఇష్టం. కానీ ఆశ్చర్యంగా నాకు లభిస్తున్న పాత్రలన్నీ చాలా కూల్‌గా ఉంటున్నాయి. షూటింగ్‌లో కొన్ని సన్నివేశాలు చేసిన తర్వాత... ఇంట్లోవారికి ఫోన్‌ చేసి భావోద్వేగానికి లోనవుతుంటా. అందుకే నన్ను ఎమోషనల్‌ పర్సన్‌ అంటుంటారు. ఎమోషనల్‌ సన్నివేశం చేసినా, చూసినా కూడా తట్టుకోలేను. అంత సెన్సిటివ్‌ పర్సన్‌ని.Mahimaaa.webp

Updated Date - Oct 04 , 2026 | 07:38 AM