నటి రాధిక పనిమనిషి కుమారుడి దారుణ హత్య
ABN, Publish Date - Nov 01 , 2026 | 07:01 AM
సీనియర్ నటి రాధిక ఇంటి పని మనిషి కుమారుడు దారుణ హత్యకు గురయ్యాడు.
సీనియర్ నటి రాధిక (Radhika) ఇంటి పని మనిషి కుమారుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కడలూరు జిల్లా బన్రుట్టి సమీపంలోని సిరువత్తూరు గ్రామానికి చెందిన రమేష్ ఎళిల్ సెల్వి దంపతులకు ప్రశాంత్ (19) (Prashanth) అనే కుమారుడు ఉన్నాడు. ఎళి ల్సెల్వి చెన్నైలోని నటి రాధిక ఇంట్లో పనిచేస్తున్నారు. ప్రశాంత్ రోజు కూలి పనులు చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 27న ఇంటి నుంచి తల్లిని చూసేందుకు చెన్నై బయలుదేరిన ప్రశాంత్.. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ప్రశాంత్ కోసం కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సిరువత్తురైకు చెందిన దేవరాసు, దినేష్ లను అదుపులోకి తీసుకుని విచారించగా, పొన్నేరి తీరానికి ప్రశాంత్‌ను రప్పించి హత్య చేసి, అక్కడే పాతిపెట్టినట్టు వెల్లడించారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు ఇద్దరు నిందితుల వద్ద ఆరా తీస్తున్నారు.