బిగ్ బాస్ విన్నర్ పవర్ ఫుల్ ఎంట్రీ.. యాక్షన్ పీక్స్‌లో!
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:15 PM
బిగ్ బాస్‌లో విన్నర్‌గా నిలిచిన ఓ నటుడు.. ద్విభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పటి వరకు ఉన్న సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తారా?
బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచి, ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలో సత్తా చాటాలని.. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రయత్నించారు. కానీ, బిగ్ బాస్ క్రేజ్ వారికి ఏమాత్రం యూజ్ కాలేదు. అందుకు ఉదాహరణ.. ఇప్పటి వరకు తెలుగు బిగ్‌బాస్‌లోని విన్నర్లే. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ అన్నింటిలో విన్నర్‌గా నిలిచిన వారెవరూ, సినిమా ఇండస్ట్రీలో సరైన గుర్తింపును పొందలేకపోయారు. మరి అలాంటిది తమిళ బిగ్ బాస్‌లో విన్నర్‌గా నిలిచిన ఓ నటుడు.. ద్విభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బిగ్ బాస్ విన్నర్, టాలెంటెడ్ యాక్టర్ ఆరి అర్జునన్ (Aari Arjunan) ప్రధాన పాత్రలో విజయ్ మిల్టన్ (Vijay Milton) తెరకెక్కించిన చిత్రం ‘GS’ (Gods and Soldiers). ఆరి అర్జునన్ హీరోగా నటించడమే కాకుండా సుందర్ బాబు, ముత్తయ్య అళగర్స్వామి, జయ శీలన్ హెన్రీల సహకారంతో రఫ్ నోట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండటం విశేషం. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.
సినిమాటోగ్రాఫర్‌గా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్ని అందించిన విజయ్ మిల్టన్.. ఇప్పుడు దర్శకుడిగా ‘GS’ (గాడ్స్ అండ్ సోల్జర్స్)ను రూపొందిస్తున్నారు. ఈ మూవీతో తెలుగు హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) తమిళ చిత్రసీమకు పరిచయం కాబోతున్నారు. అమ్ము అభిరామి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో భరత్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుండగా, సునీల్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది. కథను ఎక్కువగా రివీల్ చేయకుండా ఉత్కంఠను రేకెత్తించేలా ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. ఇదొక ఫాస్ట్ ఫేస్డ్, ఎమోషనల్ సినిమా అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
ఆరి అర్జునన్ ఇందులో ఒక నిజాయితీ, ముక్కుసూటితో దూసుకుపోయే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. భరత్ పాత్ర ప్రత్యేకంగా ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే రాజ్ తరుణ్ పాత్ర కూడా ఇప్పటి వరకు చేసిన పాత్రలకు విభిన్నంగా ఉంటుందని అర్థమవుతోంది. టెక్నికల్‌గా ఈ సినిమా హై స్టాండర్డ్స్‌లో రూపొందిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. మిల్టన్ తన కెమెరాతో మాయ చేస్తోన్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందని మేకర్స్ తెలుపుతున్నారు. త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు. తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి.. ఈ బిగ్ బాస్ తమిళ్ సీజన్ 4 విన్నర్‌కు ఈ సినిమా ఎంత వరకు కలిసొస్తుందో తెలియాలంటే మాత్రం, సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి:
రాజమౌళి వెనక ఉన్న ఫోటోలో ఒక మినీ ప్రపంచమే ఉంది.. చూశారా?
బాలయ్య హీరోయిన్‌కు అవకాశాలు కరువు.. కారణం అదేనా?
లెజెండరీ మల్టీస్టారర్ చిత్రాన్ని అలా వదిలేశారేంటి? ఇలా అయితే కష్టమే!
స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!