హీరో రవి మోహన్‌కు ఊరట.. నెలకు రూ.40 లక్షల భరణం డిమాండ్ తిరస్కరణ
ABN, Publish Date - Jul 28 , 2026 | 09:41 AM
నటుడు రవి మోహన్ కుటుంబ వివాదంలో కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
తమిళ స్టార్ హీరో రవి మోహన్ (Ravi Mohan), భార్య ఆర్తి (arthi) విడాకుల వ్యవహారం గత రెండేండ్లుగా కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు మూడు నెలల కిందట రవి మీడియా ఎదుటకు వచ్చి మరీ భార్య విడాకులు ఇవ్వకుండా నన్ను టార్చర్ చేస్తుందంటూ వాపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కోర్టులో ఉన్న ఈ కేసు విషయంలో ఓ ఆసక్తికర సమాచారం సామాజిక మాధ్యమాల్లో జాతీయ స్థాయిలో హల్‌చల్ చేస్తోంది.
భర్త రవితో విడాకుల నేపథ్యంలో నెల నెలా భరణం క్రింద రూ.40 లక్షలు కోరగా అందుకు కోర్టు సమ్మతించలేదని ప్రతి నెల రూ.3 లక్షలు చెల్లించాలని అదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేగాక పిల్లలను కలవనీయకుండాభార్య ఆర్తి అడ్డుకుంటున్నారని వచ్చిన వార్తల నేపథ్యంలో, పిల్లలను తండ్రి నిర్దిష్ట నిబంధనల ప్రకారం కలిసే అవకాశం కల్పించాలని కోర్టు ఆదేశించినట్టు సమాచారం.
ఈ తాజా న్యూస్ తర్వాత సోషల్ మీడియాలో రవి మోహన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రవి, ఆర్తి కేసులో కోర్టు సరైన తీర్పు ఇచ్చిందని అభిప్రాయ పడుతున్నారు. ఇదిలాఉంటే.. ఈ కేసు విషయంలో వస్తున్న వార్తల విషయంలో ఇప్పటివరకైతే ఎలాంటి అధికార సమాచారం లేదు. రెండు రోజుల్లో ఈ వార్తలపై ఓ క్లారిటీ రానుంది.