సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

భారతీరాజా ఆఖరి చిత్రం.. పులవర్ టీజ‌ర్ వ‌చ్చేసింది

ABN, Publish Date - Sep 11 , 2026 | 09:54 AM

దివంగత దిగ్గజ దర్శకుడు భారతీరాజా నటించిన చివరి 'చిత్రానికి పులవర్ అనే టైటిల్ ఖరారు చేసి, టీజర్ రిలీజ్ చేశారు.

Bharathirajaa

దివంగత దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) నటించిన చివరి 'చిత్రానికి పులవర్ (Pulavar) అనే టైటిల్ ఖరారు చేసి, టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో పోలీస్ స్టేషన్‌లోని ఒక గదిలో బనియన్ తో ఉన్న భారతీరాజా, ఒక హత్య కేసులో నలుగురిని విచారిస్తూ కనిపిస్తారు. మాటల్లో గంభీరంగా కనిపించే ఆయన విచారణతో పాటు క్యారమ్, టేబుల్ టెన్నిస్ ఆడుతుంటారు. 1.08 నిమి షాల నిడివితో ఉన్న ఈ టీజర్ సినిమాపై పెద్దగా ఊహాగానాలకు తావివ్వనప్పటికీ, అభిమానుల్లో అంచనాలు పెంచేలా ఉంది.

మురుగయ్య (Murukaiya) కథ సమకూర్చి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భారతీరాజా, రాచెల్ రెబాకా, హలో కందస్వామి, రవిచంద్రన్, వెట్రివేల్ రాజా, భూపాలం సెంథిల్ తదితరులు నటించారు. సూపర్ టాకీస్, వైట్సైట్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. తమిళ చిత్రసీమలో దిగ్గజ దర్శకుడుగా ఉన్న భారతీ రాజా జూన్ 10వ తేదీన భౌతికంగా దూరమైన విషయం తెలిసిందే. ఆయన నటించిన చివరి చిత్రం ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది.

Updated Date - Sep 11 , 2026 | 10:12 AM