Bhagyasri Borse: మరో లక్కీ ఛాన్స్ అందుకున్న భాగ్యశ్రీ..
ABN, Publish Date - May 06 , 2026 | 01:27 PM
ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లకు లక్ ఉండదు. సినిమాలు హిట్ అయినా కూడా అవకాశాలు రావు. కానీ, మరికొందరికి వరుస ప్లాప్ లు వచ్చినా కూడా అవకాశాలు మాత్రం వస్తూనే ఉంటాయి.
ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లకు లక్ ఉండదు. సినిమాలు హిట్ అయినా కూడా అవకాశాలు రావు. కానీ, మరికొందరికి వరుస ప్లాప్ లు వచ్చినా కూడా అవకాశాలు మాత్రం వస్తూనే ఉంటాయి. అందాల భామ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) రెండో కేటగిరిలో ఉందని చెప్పొచ్చు. మిస్టర్ బచ్చన్ సినిమాతో ఈ చిన్నది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తన అందచందాలను ఎరగా వేసి కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకుంది. ఆ తరువాత వరుస అవకాశాలు అమ్మడి తడుతూ వచ్చాయి. కానీ, అవేమి ఆమెకు విజయాలను తీసుకొచ్చిపెట్టలేదు.
వరుస ప్లాప్ లు ఉన్నా కూడా భాగ్యశ్రీ వరుస ఛాన్స్ లను అందుకుంటూనే ఉంది. ప్రస్తుతం భాగ్యశ్రీ తెలుగులో అఖిల్ సరసన లెనిన్ లో నటిస్తోంది. ఇక తమిళ్ లో కాంత సినిమాతో అడుగుపెట్టిన ఈ భామ.. తాజాగా మరో తమిళ్ సినిమాలో ఛాన్స్ పట్టేసింది. అమరన్ లాంటి హిట్ తరువాత శివకార్తికేయన్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న చిత్రం సియోన్. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తోన్నారు.
ఇప్పటికే సియోన్ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మే 6 న భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు కావడంతో మేకర్స్ ఆమె పోస్టర్ ని రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలిపారు. పోస్టర్ లో భాగ్యశ్రీ ఎంతో అందంగా కనిపించింది. గాజుల కొట్టు ముందు నెమలి పింఛాన్ని పట్టుకొని సీరియస్ లుక్ లో కనిపించింది. ఈ పోస్టర్ చూసి భాగ్యశ్రీ ఫ్యాన్స్ సినిమాలో హిట్ కళ కనిపిస్తుందే అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.