సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thalaiva 173: బాసిల్‌ జోసెఫ్‌.. ఇది నిజమేనా?

ABN, Publish Date - Apr 28 , 2026 | 05:23 PM

మలయాళ నటుడు బాసిల్‌ జోసెఫ్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘సూక్ష్మదర్శిని’, ‘పొన్‌మ్యాన్‌’ వంటి చిత్రాలతో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌బేస్‌ ఏర్పాటు చేసుకున్నారు.

మలయాళ నటుడు బాసిల్‌ జోసెఫ్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘సూక్ష్మదర్శిని’, ‘పొన్‌మ్యాన్‌’ వంటి చిత్రాలతో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక ఫ్యాన్‌బేస్‌ ఏర్పాటు చేసుకున్నారు. దరక్శకుడిగానూ ఆయనకు మంచి క్రేజ్‌ ఉంది. ‘మిన్నల్‌ మురళి’ వంటి చిత్రాలతోనూ ఆయన సత్తా చాటారు.

తాజాగా ఆయన గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కనున్న ‘తలైవా 173’లో బసిల్‌ జోసెఫ్‌ నటించే అవకాశః ఉంది కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా బాసిల్‌ ఇచ్చిన హింట్‌  ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లైంది. కొచ్చిలో ఓ వేడుకలో పాల్గొన్న బాసిల్‌ తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ తమిళంలో ఓ పెద్ద సినిమాలో భాగం కాబోతున్నా అని తెలిపారు. త్వరలో అధికారిక ప్రకటన రావచ్చని అన్నారు.  

దీంతో బాసిల్‌ ‘తలైవా 173’ సినిమా గురించే ఆయన మాట్లాడారని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.  ఇందులో రజనీకాంత్‌ తనయుడిగా బసిల్‌ నటించే అవకాశం ఉందని కోలీవుడ్‌ సమాచారం. ఈ చిత్రానికి రజనీకాంత్‌ నిర్మాత. శిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా గురించి  అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ కాంబినేషన్‌ నిజమైతే దక్షిణ భారత సినిమా అభిమానులకు ఇది ఒక క్రేజీ కాంబో అవుతుందనే చెప్పాలి.

Updated Date - Apr 28 , 2026 | 05:27 PM