సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Balan: నా సినిమాతోనే వస్తానని ప్రామిస్‌ చేసుకున్నా..

ABN, Publish Date - May 03 , 2026 | 06:41 PM

కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌, తెస్పియన్‌ ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘బాలన్‌ - ది బాయ్‌’. ‘ఆవేశం’ ఫేమ్‌ జీతూ మాధవన్‌ స్క్రిప్ట్ అందించారు.

కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌, తెస్పియన్‌ ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘బాలన్‌ - ది బాయ్‌’ (Balan). ‘ఆవేశం’ ఫేమ్‌ జీతూ మాధవన్‌ స్క్రిప్ట్ అందించారు. ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చిత్ర దర్శకుడు చిదంబరం (Chidambaram)దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. ఈ నెల 14న కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ బిజినెస్‌ వింగ్‌ అయిన మార్ష్‌ డు ఫిలింలో ‘బాలన్‌ - ది బాయ్‌’ స్ర్కీనింగ్‌ జరగనుంది. ప్రతిష్ఠాత్మక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తమ చిత్రం స్క్రీనింగ్ కావడం పట్ల మేకర్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు చిదంబరం మాట్లాడుతూ ‘కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ ప్రపంచ సినిమాకు ఇల్లు లాంటిది. ఇక్కడి ప్రేక్షకులు సినిమాను నమ్ముతారు. మా ‘బాలన్‌ - ది బాయ్‌’ మూవీ అలాంటి నిజమైన మూవీ లవర్స్‌ను హత్తుకుంటుంది. బాలన్‌ సినిమా చూస్తూ ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారు. సినిమా చూశాక ఆ ఫీల్‌ను తమతో పాటే తీసుకెళ్తారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి ప్రయాణిస్తున్నాం తెలుసుకోవాలనే తపనతో రూపొందించిన చిత్రమిది. ఇలాంటి భావోద్వేగం అనుభవించినా చెప్పేందుకు మాటలు దొరకని వ్యక్తి కోసం ఈ సినిమాను తెరకెక్కించాం’ అన్నారు.

ప్రొడ్యూసర్‌ వెంకట్‌ కె నారాయణ మాట్లాడుతూ ‘మలయాళ పరిశ్రమ తమ కంటెంట్‌తో ప్రపంచ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. మా ‘బాలన్‌ - ది బాయ్‌’ సినిమా స్ర్కిప్ట్‌ను బలంగా నమ్మాం కాబట్టే కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అడుగుపెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరూ చర్చించుకునేలా మా సినిమా ఉంటుంది. బాలన్‌ సినిమా మాత్రమే కాదు ఇదొక డిక్లరేషన్‌’ అన్నారు.

ప్రొడ్యూసర్‌ శైలజా దేశాయ్‌ ఫెన్‌ మాట్లాడుతూ ‘కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. నాలుగేళ్ల క్రితం కేన్స్‌కు వచ్చినప్పుడు నెక్ట్స్‌ టైమ్‌ నా సినిమాతోనే వస్తానని ప్రామిస్‌ చేసుకున్నా. ఇప్పుడు ‘బాన్‌ - ది బాయ్‌’తో కేన్స్‌కు రావడం సంతోషంగా ఉంది. మేము ఎంతగానో నమ్మకం పెట్టుకున్న ‘బాన్‌ - ది బాయ్‌’ సినిమా కేన్స్‌లో ప్రదర్శితం కానుండటం గర్వంగా ఉంది. డైరెక్టర్‌ చిదంబరం విజన్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా’ అని అన్నారు.

Updated Date - May 03 , 2026 | 06:46 PM