Avira: సినిమా నిర్మాణంలో ఏఐ విప్లవం.. ‘అవిరా’తో కొత్త ప్రయోగం
ABN, Publish Date - Jul 18 , 2026 | 10:17 AM
కృత్రిమ మేధ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది.
కృత్రిమ మేధ (Artificial Intelligence - AI) సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఇప్పుడు అదే టెక్నాలజీ భారతీయ చిత్రపరిశ్రమలోనూ కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఫొటో రియలిస్టిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించి రూపొందుతున్న తొలి భారతీయ ఫీచర్ ఫిల్మ్‌గా ‘అవిరా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ప్రభాకరన్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా పౌరాణిక కథాంశానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తూ తెరకెక్కుతోంది. ఫొటో రియలిస్టిక్ ఏఐ టెక్నాలజీతో పాత్రలు, విజువల్స్‌ను అత్యంత సహజంగా సృష్టించడం ఈ చిత్ర ప్రత్యేకతగా నిలుస్తోందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు ప్రభాకరన్ మాట్లాడుతూ 'అవిరా’ అంటే విశ్వ కాంతి. పౌరాణిక అంశాలను ఆధారంగా తీసుకుని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఫాంటసీ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఫొటో రియలిస్టిక్ ఏఐ టెక్నాలజీతో సరికొత్త పాత్రలను సృష్టించాం. కథ, విజువల్స్, సాంకేతికత పరంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేశాం. ప్రస్తుతం సినిమా చివరి దశ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి' అని తెలిపారు.