హీరోయిన్ లేకుండా.. ‘వేటస్వామి’
ABN, Publish Date - Aug 31 , 2026 | 09:28 AM
అరుళ్‌నిధి, అమీర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఆధ్యాత్మిక థ్రిల్లర్ ‘వేటస్వామి’ ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలయ్యాయి.
కథానాయిక లేకుండా కేవలం కథకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, హీరో ఆరుళ్ నిధి (Arulnithi), దర్శకనటుడు అమీర్ (Ameer) ప్రధాన పాత్రలు పోషించిన వేటస్వామి (Vetta Saami) చిత్రం ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలను ప్రారంబించారు. తిరునెల్వేలి జిల్లా ప్రజల ఆరాధ్య దేవతలైన సంగిలి భూతతార్, సుడలై మదన్ ఆరాధన ఆధారంగా రూపొంచించారు.
వేట స్వామి సినిమా గ్లింప్స్ పరిశీలిస్తే, వయోలిన్ వాద్యకారిణి మాధవి గాత్రంతో ప్రారంభమయ్యే ఈ సినిమా గ్లింప్స్ దైవారాధనపై దృష్టి సారిస్తూ అరుళ్నిధి, అమీర్ పాత్రలను పరిచయం చేశారు. గ్రామీణ జీవితం, ఆధ్యాత్మిక భావనల మిశ్రమంగా ఈ సినిమా తెరకెక్కించి నట్టు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.
మూవీలోని ఇతర పాత్రల్లో మధు సూధన్ రావు, హరీష్ పేరడి, వీజీ చంద్రశేఖర్, ఇందుమతి మణికంఠన్, మైనా నందిని, కవితా భారతి, అయాజ్ ఖాన్ వంటి తదితరులు నటించారు. 'బంపర్' మూవీకి దర్శకత్వం వహించిన ఎం.సెల్వకుమార్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, 7 మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్స్ పతాకంపై శామ్యూల్ మ్యాథ్యూ నిర్మించారు.