‘సీతా పయనం’ కథ మొత్తం చిరుకి తెలుసు..
ABN, Publish Date - Feb 08 , 2026 | 02:11 PM
అర్జున్ సర్జా (Arjun Sarja) హీరోగానే కాకుండా దర్శకుడిగానూ నిరూపించుకున్నారు. కొంత గ్యాప్ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘సీతాపయనం’ (Seetha Payanam). నిరంజన్
అర్జున్ సర్జా (Arjun Sarja) హీరోగానే కాకుండా దర్శకుడిగానూ నిరూపించుకున్నారు. కొంత గ్యాప్ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘సీతాపయనం’ (Seetha Payanam). నిరంజన్, అర్జున్ కుమార్తె ఐశ్వర్య కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచారంలో భాగంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ కథ బాగా తెలుసని, ఆయనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఈ సినిమాలో కీలక పాత్రల కోసం మంచి ఆర్టిస్ట్‌లను సెలెక్ట్ చేయమని చిరంజీవి సూచించారని తెలిపారు.
అర్జున్ మాట్లాడుతూ ‘చిరంజీవి సూచనల మేరకు ఈ కథకు తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోవాలనుకున్నాం. కానీ ఆయన డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ సినిమాలో భాగం కాలేకపోయారు. దాంతో ఆ పాత్రకు సంబంధించి కొన్ని మార్పులు చేసి నేనే ఆ పాత్ర పోషించాను’ అని అన్నారు.