‘చికిరి’ ఎఫెక్ట్.. మారిన 'AR రహమాన్' జాతకం! పారితోషికం డబుల్
ABN , Publish Date - Apr 21 , 2026 | 05:57 PM
ఒక్క పాటతో ఆస్కార్ విజేత రహమాన్ కంబ్యాక్ అయ్యాడు. అతని కరిజ్మా తగ్గిందనుకున్న సమయంలో మళ్ళీ శిఖరానికి చేరుకున్నాడు. కాస్త గ్యాప్ వచ్చింది తప్పితే.. తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే ఇప్పుడీ ఆస్కార్ విజేత తన పారితోషికాన్ని రెట్టింపు చేశాడట.
ఎ.ఆర్. రహమాన్ సంగీత రంగంలో అద్భుతాలు సృష్టించిన మ్యూజిక్ డైరెక్టర్. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన గ్రాఫ్ కొన్నాళ్ళుగా అంతగా బాగా లేదు. క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు కానీ సాంగ్స్ పరంగా వండర్స్ క్రియేట్ చేయలేకపోతున్నాడు. అయితే తాజాగా ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కు మంచి టైమ్ వచ్చింది. ఊహించని విధంగా సరికొత్త అవకాశాలు లభించడమే కాదు... ఆ పాటలు సక్సెస్ అవుతున్నాయి కూడా!
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రహమాన్ పూర్తి స్థాయిలో కమ్‌బ్యాక్ మోడ్‌లోకి వచ్చేసినట్టే కనిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన 'చికిరి' సాంగ్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ఒక్క సాంగ్ వైరల్ అవడంతోనే రహమాన్‌కు మళ్లీ డిమాండ్ వచ్చేసింది. ఆయన జోరు కాస్తంత తగ్గినా... చేసిన సౌండ్ మాత్రం గట్టిగానే ఉందని సినీ ప్రపంచం అంటోంది. 'చికిరి' పాటతో రహమాన్ జాతకం కూడా మారిపోతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
'పెద్ది' సినిమా కోసం రహమాన్ రూ. 6 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నాడట. ఆయన గతంతో తీసుకున్న రెమ్యూనరేషన్‌తో పోల్చితే ఇది చాలా తక్కువట. ఇండస్ట్రీలో మారుతున్న బడ్జెట్ డైనమిక్స్‌కు అనుగుణంగా ఆయన తీసుకున్న దానిని ఓ అడ్జస్ట్‌మెంట్‌గా భావించారు. కానీ 'పెద్ది'లోని పాట హిట్ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఇదే ప్రొడక్షన్ హౌస్ మరో మిడ్-రేంజ్ ప్రాజెక్ట్ కూ రహమాన్‌ను మ్యూజిక్ చేయమని కోరితే... ఆయన ఈసారి రూ.10 కోట్ల వరకు కోట్ చేశారట. అది విని నిర్మాతలు షాక్ అయ్యారని టాక్. ఇది కేవలం రెమ్యునరేషన్ జంప్ కాదని, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రహమాన్ తీసుకున్న స్ట్రాటజీ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also: సుకుమార్ రేంజ్‌లో.. పెద్ది స్పెషల్ సాంగ్!
Read Also: NBK 111: బాలయ్య సరసన మరో హీరోయిన్ ఎవరంటే