సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

AR Rahman: ‘మైలే... వినండి.. మీకు నచ్చిందో లేదో చెప్పండి’

ABN, Publish Date - Jan 19 , 2026 | 07:21 AM

ఏ.ఆర్‌ రెహమాన్ (AR Rahman) ఇటీవల హిందీ చిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

AR Rahman

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్ (AR Rahman) ఇటీవల హిందీ చిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వివాదాల నడుమ ఆయన ప్రభుదేవా ( Prabhudheva) నటిస్తున్న ‘మూన్‌వాక్‌’ (Moon Walk) చిత్రం నుంచి ‘మైలే’ అనే కొత్త పాటను విడుదల చేశారు. మనోజ్‌ నిర్మల శ్రీధరన్‌ దర్శకత్వంలో సంగీతం, డ్యాన్స్‌, కామెడీ కలగలసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

ఈ సినిమా నుంచి రెండో సింగిల్‌ అయిన ‘మైలే’ (Mayile Song)పాటను రెహమాన్‌ విడుదల చేశారు. ‘మైలే... వినండి, మీకు నచ్చిందో లేదో చెప్పండి’ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. విష్ణు ఎడవన్‌ సాహిత్యం అందించిన ఈ పాటను జోయల్‌ జో ఆలపించారు. కష్టాలను మర్చిపోయి, ధైర్యంగా చిరునవ్వుతో ముందుకు సాగాలని చెప్పే హుషారైన గీతం ఇదని చిత్రబృందం పేర్కొంది.

25 ఏళ్ల తర్వాత.. క్రేజీ కాంబినేషన్‌

‘ఊర్వశి ఊర్వశి’, ‘ముకాబ్లా’ లాంటి సూపర్‌హిట్‌ గీతాలతో అలరించిన ప్రభుదేవా-రెహమాన్‌ కాంబినేషన్‌ 25 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇందులో ప్రభుదేవా గొప్ప డ్యాన్సర్‌గా కనిపించనుండగా, రెహమాన్‌ కూడా ఒక ప్రత్యేక పాత్రలో (ఓ కోపిష్టి దర్శకుడిగా) సందడి చేయనున్నారు. గతంలో ‘వందేమాతరం’ వంటి ఆల్బమ్స్‌లోనూ, కొన్ని సినిమాల్లోని పాటల్లోనూ ఆయన కనిపించినప్పటికీ ఒక సినిమాలో పాత్రను పోషించడం, నటించడం మాత్రం రెహమాన్‌ కెరీర్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం. మేలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Jan 19 , 2026 | 07:21 AM