సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆ హోటల్ గదిలో విక్రమ్ కొడుకును చెప్పుతో కొట్టిన అనుపమ..

ABN, Publish Date - Jul 20 , 2026 | 03:12 PM

ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలను ఊపేస్తున్న ఒకే ఒక్క న్యూస్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), ధ్రువ్ విక్రమ్‌ (Dhruv Vikram) బ్రేకప్.

Anupama Parameswaran

ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలను ఊపేస్తున్న ఒకే ఒక్క న్యూస్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), ధ్రువ్ విక్రమ్‌ (Dhruv Vikram) బ్రేకప్. గత మూడేళ్లుగా రహస్యంగా ప్రేమాయణం సాగించిన ఈ జంట సడెన్ గా బ్రేకప్ తో విడిపోయారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారని అనుకున్న ఈ క్రేజీ జంట మధ్య తీవ్ర విభేదాలు రావడానికి ధ్రువ్ విక్రమ్ ధోరణే కారణమని తెలుస్తోంది. సాధారణంగా బ్రేకప్స్ కన్నీళ్లతో ముగుస్తాయి. కాకపోతే ఈ జంట బ్రేకప్ అత్యంత దారుణంగా ముగిసిందని టాక్ నడుస్తోంది. అది ఎంతలా అంటే ధ్రువ్ ని అనుపమ చెప్పుతో కొట్టి మరీ బ్రేకప్ చెప్పిందంట.


ఈ బ్రేకప్ కథకు సంబంధించిన అసలు క్లైమాక్స్ చెన్నైలోని ఒక స్టార్ హోటల్‌లో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. బ్రేకప్ విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరగగా, ధ్రువ్ ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన అనుపమ పరమేశ్వరన్ అతడిని ఏకంగా చెప్పుతో కొట్టిందని, అక్కడే ధ్రువ్‌కు నానా శాపనార్థాలు పెట్టిందంట. నువ్వు నాశనం అయిపోతావని,ఆడదానిని ఏడిపించిన మగాడు బాగుపడడు అని తిట్టి మరీ ఆ హోటల్ నుంచి కదిలినట్లు సమాచారం.ఆ హోటల్ నుంచి బయటకు వచ్చిన తక్షణమే అతడిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసి ఇకపై ఎవరి అనుమతులూ అవసరం లేదు, ఎలాంటి భయాలూ లేవు అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి కొత్త జీవితాన్ని మొదలుపెట్టిందని టాక్.


ఇక బ్రేకప్ తరువాత అనుపమ ఎంత హ్యాపీగా ఉందో.. దానికి రివర్స్ లో ధ్రువ్ విక్రమ్ అంతా బాధలో ఉన్నట్లు సమాచారం. ఈ సంచలన ఘటన తర్వాత తీవ్ర నిరాశకు గురై ఎవరినీ కలవకుండా ఒంటరిగానే ఉంటున్నాడట. మూడేళ్లుగా ఈ జంట రిలేషన్ లో ఉన్నారు. మొదటి ఏడాది బానే ఉన్నా.. ఆ తరువాత ధ్రువ్.. అనుపమపై పెత్తనం చెలాయించడం మొదలుపెట్టాడట. అది చేయకు.. ఇది చేయకు అంటూ ఆంక్షలు పెట్టాడని టాక్. మూడేళ్లు ఎంత టార్చర్ పెట్టి ఉంటే ఆమె అంతలా చెప్పుతో కొట్టేవరకు వస్తోంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఇదేకనుక నిజమైతే ధ్రువ్ కెరీర్ పై గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. మరి దీనిపై ధ్రువ్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.

Updated Date - Jul 20 , 2026 | 03:17 PM