నటుడు దర్శన్‌కు.. మళ్లీ చుక్కెదురు! భార్య పిటిషన్.. తిరస్కరించిన సుప్రీం
ABN, Publish Date - Oct 10 , 2026 | 07:57 AM
చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసుకు సంబంధించి నటుడు దర్శన్‌కు మరో షాక్ తగిలింది.
చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసు (Renukaswamy Murder Case) కు సంబంధించి నటుడు దర్శన్ (Darshan) కు మరో షాక్ తగిలింది. అప్రూవర్‌గా మారిన 14వ నిందితుడు ప్రద్యూష్ రావు (Pradosh Rao) కు వ్యతిరేకంగా దర్శన్ భార్య విజయలక్ష్మి (Vijayalakshmi) సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. కేసులో మహత్తర మైన మలుపుగా బావిస్తున్న ప్రద్యూష్రవ్ అప్రూవర్‌గా మారడంపై కోర్టు అంగీకరించింది.
ఇప్పటికే విచారణ సాగుతున్నాయి. కానీ సీఆర్పీసీ 164వ నిబంధనలు పాటించకుండానే ఇతర నిందితులకు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రద్యూష్ అప్రూవర్‌గా అవకాశం కల్పించారని నిబంధనలకు వ్యతిరేకమని విజయలక్ష్మి హై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే.
దీంతో ఆమె ఇదే విషయమై సుప్రీం కోర్టు (Supreme Court of India | India) ను ఆశ్రయించగా అక్కడా పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. విచారణ వేళ వాద ప్రతివాదుల ప్రస్తావించిన అంశాలను ఆలకించింది. చివరగా హైకోర్టు తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి చట్ట వ్యతి రేకమైన అంశాలు లేవని పిటి షన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దర్శన్‌కు అన్ని మార్గాలు మూసుకు పో యినట్లయింది.