అనిరుధ్: ఇప్పుడు కోట్లు తీసుకుంటున్నా.. ఆ సంతోషం లేదు
ABN, Publish Date - Feb 10 , 2026 | 10:36 AM
వివాహా వేడుకల్లో జరిగే సంగీత కచ్చేరిలకు వెళ్ళి ఐదు వందల రూపాయల పారితోషికం తీసుకున్న రోజుల్లో ఉన్న సంతోషం ఇపుడు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నా లేదని అనిరుధ్ రవిచందర్ చెప్పుకొచ్చారు.
వివాహా వేడుకల్లో జరిగే సంగీత కచ్చేరిలకు వెళ్ళి ఐదు వందల రూపాయల పారితోషికం తీసుకున్న రోజుల్లో ఉన్న సంతోషం ఇపుడు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నా లేదని ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) చెప్పుకొచ్చారు. తాజాగా చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘చిన్న వయసులో వివాహ వేడుకల్లో ఏర్పాటు చేసే సంగీత కచ్చేరిలకు వెళ్ళే సమయంలో రూ.500 ఇచ్చేవారు. అప్పుడు ఏదో తెలియని సంతోషం ఉండేది. కొన్ని వేడుకల్లో డబ్బులు ఇవ్వకుండా కేవలం ఆకు వక్క చేతిలో పెట్టి ధన్యవాదాలు చెప్పి పంపించేవారు. ఇప్పుడు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ అందుతోంది. కానీ, అప్పుడు ఉన్న సంతోషం ఇప్పుడు లేదు. ఒక సంగీత దర్శకుడిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బాల్యంలో అనుభవించిన ఆ సంతోషాన్ని ఎన్నటికీ మరిచిపోలేం’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం అనిరుద్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. 'జన నాయగన్' నుంచి అల్లు అర్జున్ - అట్లీ సినిమా వరకు 11 సినిమాలకు సంగీతం (music Director0 అందిస్తున్నారు.