అనిరుధ్ స్వరాలకు..15వసంతాలు
ABN, Publish Date - Nov 17 , 2026 | 09:26 AM
వై దిస్ కొలవెరి డి పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్ రవిచందర్ సంగీత ప్రస్థానానికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) తన సంగీత ప్రస్థానంలో 15 యేళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. 2011, నవంబరు 16వ తేదీన '3' అనే చిత్రంలో 'వై దిస్ కొలవెరి డి' అనే పాటతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచారు. ఇప్పుడు దేశంలోనే అత్యంత ముఖ్యమైన సంగీత స్వరకర్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
తన 15 యేళ్ళ సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. '15 యేళ్ళ క్రితం ఇదే రోజున నా మొదటి పాట సంగీత ప్రపంచానికి పరిచమైంది. అప్పటి నుంచి ఈ జర్నీ అప్రతిహతంగా సాగుతోంది. ఈ 15 సంవత్సరాల సంగీతం జ్ఞాపకాలు, వేడుకతో మాయాజాలంగా మారిపోయింది.
తమిళంలో ప్రారంభమై ఒక భాష నుంచి మరొక భాషకు, ఒక హృదయం నుంచి లక్షలాది హృదయాలకు చేరిన ప్రయాణం. స్వతంత్ర సంగీతం. మా అభిమాన అంతర్జాతీయ కళాకారులతో కలలు సహకారాలు. ఏ భాషలోనైనా, ఎవరికోసమైనా పాడటం, ఈ దేశం చూసిన అతిపెద్ద హిట్ పాటల్లో భాగస్వామి అయ్యే అదృష్టం దక్కింది. ఈ ప్రయాణంలో దేశంలోని ఉత్తమ దర్శకులు, తారలు, నిర్మాతలతో పనిచేసే అవకాశం నాకు లభించింది.
చిత్రపరిశ్రమలోని ఉత్తమ కళాకారులు, ప్రతిభావంతులతో కలిసి ఉత్తమమైన పాటలు సృష్టించాం. సంగీత విభావరిలు నిర్వహించే సమయంలో అభిమానుల ఉత్సాహం, ఆనందం, అనుభూతి ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలు. ప్రతి పాట, ప్రతి సహకారం, ప్రతి విజయం, ప్రతి వేదిక, ప్రతి మైలు రాయి ఒక వరంలాంటిది. 'ఎల్ఐకే', 'జననాయగన్', 'డీసీ', 'ప్యారడైజ్, 'జైలర్-2' వంటి చిత్రాలతో 2026 సంవత్సరం అద్భుతంగా నిలిచిపోయింది. ఇపుడు 15 సంవత్సరాల వేడుకను జరుపుకోవడానికి ఇంతకంటే మంచిన తరుణం ఏముంటుంది' అని పేర్కొన్నారు.