సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సౌత్‌ను ఊపేస్తున్న ఇద్దరు బక్కోళ్లు.. వీళ్ల రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాకే!

ABN, Publish Date - Jul 08 , 2026 | 07:53 PM

ఒకప్పుడు సినిమా సూపర్ హిట్ అయితే.. అందులో మ్యూజిక్ డైరెక్టర్లకు కాస్త పేరు వచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది.

Anirudh Ravichander, Sai Abhyankkar

ఒకప్పుడు సినిమా సూపర్ హిట్ అయితే.. అందులో మ్యూజిక్ డైరెక్టర్లకు కాస్త పేరు వచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. డైరెక్టర్ ఎవరైనా, హీరో ఎవరైనా సరే.. మ్యూజిక్ డైరెక్టర్ పేరు చూసే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. సినిమా బాగుంటే ఒకే.. ఒకవేళ ప్లాప్ అయినా కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోనే ఆ సినిమాను నిలబెట్టే రేంజ్‌కు మన మ్యూజిక్ డైరెక్టర్లు ఎదిగిపోయారు. ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల పేర్లు మారుమోగిపోతున్నాయి. చూడటానికి సన్నగా, బక్కగా ఉండే ఈ ఇద్దరు కుర్రాళ్లు.. తమ మ్యూజిక్‌తో మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. వాళ్లే అనిరుధ్ (Anirudh Ravichander), సాయి అభ్యంకర్ (Sai Abhyankkar).

సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో బక్కోడు అనగానే ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు అనిరుధ్‌ రవిచంద్రన్‌. ధనుష్ నటించిన 3 మూవీలో కొలవెరి డి సాంగ్‌తో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ సెన్సేషన్.. అతి తక్కువ కాలంలోనే ఊహించని స్థాయిలో హ్యూజ్‌ ఫ్యాన్‌ బేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు స్టార్‌ హీరోల సినిమాలు అంటే ముందుగా వినిపించే పేరు అనిరుధ్‌దే. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్‌, దళపతి విజయ్‌ లాంటి స్టార్స్ సినిమాలంటే.. ప్రేక్షకులకు పూనకాలు వచ్చేంత రేంజ్‌లో మ్యూజిక్‌ ఇవ్వడం ఇతని స్పెషాలిటీ. ప్రస్తుతం ఇతని షెడ్యూల్‌లో దాదాపు 10 భారీ సినిమాలు రాబోతున్నాయి.

అందులో తెలుగు నుంచి నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న ది ప్యారడైజ్‌ ఒకటి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ - లోకేష్‌ కనగరాజు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ సినిమా.. దీనికి తోడు, జూనియర్ ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కలయికలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ గాడ్‌ ఆఫ్‌ వార్‌ కూడా ఇతని లిస్ట్‌లో ఉన్నాయి. నిన్నటి వరకు ఒక్కో సినిమాకు 12 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్న అనిరుధ్‌.. తనకున్న ఫుల్ డిమాండ్ కారణంగా ఇప్పుడు ఏకంగా 25 కోట్ల మేర డిమాండ్‌ చేస్తున్నాడని ఇండస్ట్రీలో గట్టిగా టాక్‌ వినిపిస్తుంది. ఒక్క మ్యూజిక్ డైరెక్టర్‌కి ఇన్ని కోట్లా అని ఆశ్చర్యపోకండి, ఎందుకంటే అనిరుధ్‌ డేట్స్ కోసం కోట్ల రూపాయల అడ్వాన్స్ పట్టుకుని క్యూలో నిలబడే దర్శక నిర్మాతల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. అదీ మనోడి స్టామినా!

ఇక అచ్చం అనిరుధ్ బాటలోనే, సౌత్ ఇండస్ట్రీని షేక్ చేయడానికి వస్తున్న మరో బక్కోడు, నూనుగు మీసాలోడు.. సాయి అభ్యంకర్‌. ప్రైవేట్‌ సాంగ్స్‌తో ఇప్పటికే యూత్‌లో ఎక్కడిలేని క్రేజ్‌ను తెచ్చుకున్న ఈ యంగ్ టాలెంట్, ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌ సెన్సేషన్‌గా దూసుకెళ్తున్నాడు. తన ఫస్ట్‌ సినిమా బల్టీ కోసమే ఏకంగా 2 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకొని ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచాడు. ఆ తరువాత వచ్చిన డ్యూడ్‌, అలాగే రీసెంట్‌గా వచ్చిన కరుప్పు మ్యూజికల్‌ బ్లాక్ బస్టర్స్ కావడంతో మనోడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇటీవలే ధనుష్‌ హీరోగా నటిస్తున్న ఓమ్‌ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్‌ అందించాడు. రీసెంట్‌గా వచ్చిన ఈ సినిమా టీజర్‌కు సోషల్‌ మీడియాలో అదిరిపోయే రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చింది. వీటితో పాటు రాఘవ లారెన్స్‌ హీరోగా నటిస్తున్న బెంజ్‌ సినిమాకి కూడా పవర్‌ఫుల్ మ్యూజిక్‌ను అందిస్తున్నాడు.

అయితే, సాయి అభ్యంకర్‌ లైనప్‌లో ఉన్న అతి పెద్ద మూవీ రాకా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ భారీ మూవీకి సాయి అభ్యంకర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు అనగానే మొదట్లో చాలా మందే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్టును ఈ చిన్న పిల్లాడు హ్యాండిల్ చేయగలడా అని కామెంట్స్ వినిపించాయి. కానీ రీసెంట్‌గా వచ్చిన డ్యూడ్, కరుప్పు సినిమాల మ్యూజిక్‌ విన్నాక మనోడిలో టాలెంట్‌ గట్టిగానే ఉందని ఇండస్ట్రీ ఫిక్స్ అయిపోయింది. ఇక వరుస ఆఫర్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సాయి అభ్యంకర్‌ కూడా తన రెమ్యునరేషన్‌ను భారీగానే పెంచేశాడట. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులకు దాదాపు 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ ను డిమాండ్‌ చేస్తున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. మొత్తానికి ఒకప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీని సీనియర్స్ రూల్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు బక్కోళ్లు మాత్రం అటు కోలీవుడ్‌ను, ఇటు టాలీవుడ్‌ను తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్లతో ఏలేస్తున్నారనే చెప్పాలి.

Updated Date - Jul 08 , 2026 | 09:27 PM