Anirudh: 'అరవింద్’తో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన అనిరుధ్‌

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:44 PM

సంగీత సంచలనం..రాక్‌స్టార్‌ అనిరుధ్ రవిచందర్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయ‌న త‌న సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుక‌ర్కీ రికార్డ్స్‌తో పాటు యూనివ‌ర్స‌ల్ మ్యూజిక్ ఇండియాతో క‌లిసి చేసిన ‘అరవింద్’ పాటను రిలీజ్ చేశారు.

సంగీత సంచలనం..రాక్‌స్టార్‌ అనిరుధ్ (Anirudh Ravichander) రవిచందర్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయ‌న త‌న సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుక‌ర్కీ రికార్డ్స్‌తో (Albuquerque Records) పాటు యూనివ‌ర్స‌ల్ మ్యూజిక్ ఇండియాతో క‌లిసి చేసిన ‘అరవింద్’ పాటను రిలీజ్ చేశారు. ఈ కాంబోలో రిలీజైన తొలి పాట ఇది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒరిజిన‌ల్ పాప్‌, హిప్ హాప్ ఆధారంగా రూపొందిన‌ ఈ ట్రాక్‌తో అనిరుద్ త‌న సంగీత ప్ర‌పంచంలోని ప‌రిధిని దాటి కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించారు. 2012లో విడుదలైన వైరల్ హిట్ ‘వై దిస్ కొలవెరి డి’ ద్వారా అనిరుద్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాదిన జైల‌ర్‌, కూలీ, విక్ర‌మ్‌, లియో, దేవ‌ర  వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 2025లో 'జ‌వాన్‌' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కూడా సంగీత దర్శకుడిగా అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు

అర‌వింద్ పాట విష‌యానికి వ‌స్తే.. మారుతోన్న డిజిట‌ల్ సంగీత ప్రపంచంలో త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకోవ‌టానికి ఓ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ప‌డే క‌ష్టాల‌ను ప్ర‌ధానంగా ఆవిష్క‌రించారు అనిరుద్‌. ఈ పాట కథలో కేంద్రంగా నిలిచే పాత్ర పేరు అరవింద్. అనిరుధ్‌కి ప్రతిబింబంలాంటి పాత్ర ఇది. ఈగో, ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా, సంగీతంపై ఉన్న ప్యాషన్‌తో తన జీవితాన్ని పూర్తిగా దానికి అంకితం చేసిన యువ సంగీతకారుడే అర‌వింద్‌. ఇప్పటి డిజిటల్ యుగంలో పాటలను విడుదల చేయటం చాలా సుల‌భం. అయితే ద‌క్షిణ భార‌త సినీ రంగంలో ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా ప్ర‌తిభ‌ను నిరూపించుకుంటూ కెరీర్‌ను కొనసాగించడం మాత్రం అంత సులువైన విష‌యం కాదు. అయినప్పటికీ ఏదో ఒక రోజు తన సంగీతం ప్రేక్షకులను చేరుకుంటుందనే నమ్మకంతో అరవింద్ ముందుకు సాగుతుంటాడు.

ALSO READ: Buchi Babu Sana: మహేశ్‌తో సినిమా.. బుచ్చిబాబు రియాక్షన్‌ ఇదే!





ఈ సంద‌ర్బంగా అనిరుద్ మాట్లాడుతూ ‘‘అరవింద్’ అంటే ప్రతి ఒక్కరిలో ఉండే ఓ త‌ర‌హా వ్యక్తిత్వమే. మన అందరి జీవితాల్లో ఓ అరవింద్ ఉంటాడు. అయితే తన ప్రతిభను చూపించడానికి ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తోన్న‌ ఓ స్వతంత్ర కళాకారుడి కథను ఈ పాట చెబుతుంది. నేటి డిజిట‌ల్ ప్ర‌పంచంలో ఉన్న విప‌రీత‌మైన పోటీలో  పెద్ద స్థాయికి చేరుకునే స‌మ‌యంలో ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఎదుర్కొనే సవాళ్లను ఇది ప్రతిబింబిస్తుంది' అన్నారు. అల్బుకర్కీ రికార్డ్స్ ద్వారా రాబోయే రోజుల్లో వివిధ రకాలైన ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రాజెక్ట్స్ , కాన్సెప్చువ‌ల్ ప్రాజెక్ట్స్‌ను డెవ‌ల‌ప్ చేసి రిలీజ్ చేయ‌టానికి అనిరుద్ సిద్ధ‌మ‌వుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Kanchana 4: లారెన్స్ భారీ స్కెచ్! ‘కాంచన 4’.. రష్మిక ఔట్! నయనతార ఎంట్రీ?

Buchi Babu Sana: పెద్ది చూశాక.. సురేఖ, సుస్మితలు కాల్ చేసి ఏడిచేశారు

హిట్‌ జోడీ మరోసారి.. అభిమానులకు పండగలా కాంబినేషన్స్

Ram Charan: బుచ్చిబాబుతో అయిపోయింది.. మ‌రో సుకుమార్‌ శిష్యుడిని లైన్‌లో పెట్టిన రామ్ చ‌ర‌ణ్

ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్


Updated Date - Jun 15 , 2026 | 05:02 PM